Begin typing your search above and press return to search.
హైదరాబాద్ ఎంత దరిద్రంగా మారిందో చెప్పిన కేసీఆర్!
By: Tupaki Desk | 19 July 2019 6:23 AM GMTఎవరేం అనుకుంటారో అస్సలు పట్టించుకోకుండా తాను చెప్పాలనుకున్నది కొన్నిసార్లు చెప్పేస్తుంటారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. ఆ ఫ్లోలో ఆయన చాలానే నిజాలు చెప్పేస్తుంటారు. తాజాగా అలాంటి నిజాల్ని మస్తుగా చెప్పుకొచ్చారు కేసీఆర్. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో ఉన్న దారుణ పరిస్థితుల్ని భలేగా చెప్పారు సీఎం సారూ.
తాను చిన్నప్పుడు హైదరాబాద్ కు వస్తే చల్లగా ఉండేదని.. ఒకప్పుడు హైదరాబాద్ కు వస్తే తెల్లగా మారేటోళ్లని.. బంజారాహిల్స్ లో ఫ్యాన్ అవసరం లేదని.. అలాంటి నగరం కాస్తా ఈ రోజున ఏసీ లేనిదే ఉండలేని పరిస్థితి ఉందన్నారు. నగరం మొత్తం కాంక్రీట్ జంగిల్ గా మారిందన్న ఆవేదనను వ్యక్తం చేశారు.
బంజారాహిల్స్ లో ఆక్సిజన్ క్లబ్బులు తెరిచారని.. మంచి గాలిని కొనుక్కుంటున్నారని.. అలాంటి దరిద్రపు రోజులు వచ్చేశాయన్నారు. ఈ తిట్లు అన్ని బాగానే ఉన్నాయి కానీ సారు.. గడిచిన ఐదేళ్లుగా తమరే ముఖ్యమంత్రి.. ఒక నగరాన్ని మొత్తంగా మార్చేయకున్నా.. మార్పు అంతో ఇంతో చేయటానికి ఐదేళ్లు అన్నది చాలా ఎక్కువ.
ఆ వ్యవధిలో చేసిందేమీ లేదు కానీ.. ఇప్పుడేదో చేస్తామన్నట్లుగా మాట్లాడటం ఎందుకంటారు? అలా చేస్తాం.. ఇలా చేస్తామన్న మాటలు సరే.. ఐదేళ్లలో ఎంత చేసింది అందరూ చూసిందే. అలాంటప్పుడు ఇప్పుడు మాటలు బంద్ చేసి.. చేయాల్సిన పని కాస్త అయినా చేసి.. ఆ తర్వాత చేయాలనుకుంటున్న ముచ్చట్లు చెప్పేస్తే బాగుంటుందేమో సారు. మాటలు ఎక్కువై..పని తగ్గిందన్న మాట బాగా ఎక్కువగా వినిపిస్తోంది సారూ. అందుకే.. కాస్త పని మీద ఫోకస్ పెట్టేసి.. హైదరాబాద్ ను సమూలంగా మార్చేయండి.