Begin typing your search above and press return to search.

మోదీ దెబ్బ‌కు కేసీఆర్ కాళ్లు విరిగిపోయాయ‌ట‌!

By:  Tupaki Desk   |   15 March 2017 11:07 AM GMT
మోదీ దెబ్బ‌కు కేసీఆర్ కాళ్లు విరిగిపోయాయ‌ట‌!
X
టీఆర్ ఎస్ అధినేత‌ - తెలంగాణ సీఎం కేసీఆర్... ఏ అంశంపై మాట్లాడినా ఆస‌క్తిక‌ర‌మే. విప‌క్షాల‌పై విరుచుకుప‌డినా... ఇత‌ర పార్టీల గొప్ప‌లు చెప్పినా... ప్ర‌త్య‌ర్థుల‌ను మెచ్చుకుంటూ కామెంట్లు చేసినా... అది కేసీఆర్‌ కే చెల్లింది. ఓ వైపు వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి తెలంగాణ‌లో బ‌లీయ‌మైన శ‌క్తిగా ఎదిగేందుకు బీజేపీ ప‌క్కా వ్యూహాలు ర‌చిస్తూ... టీఆర్ ఎస్‌ కు పెద్ద దెబ్బే కొట్టేందుకు య‌త్నిస్తున్న నేప‌థ్యంలో నేటి శాస‌న‌స‌భా స‌మావేశాల్లో భాగంగా కేసీఆర్ చేసిన ప్ర‌సంగం మ‌రింత ఆస‌క్తిక‌రంగా ఉంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. అసెంబ్లీ స‌మావేశాల్లో భాగంగా కొద్దిసేపు శాస‌న‌మండ‌లికి వెళ్లిన కేసీఆర్‌... అక్కడి స‌భ్యుల మ‌దిని దోచుకునేలా ప్ర‌సంగించారు.

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ తమ పాల‌న‌ను కీర్తిస్తూ చేసిన మాట‌ల‌ను ప్ర‌స్తావించిన విష‌యాల‌ను చెప్పుకొచ్చిన కేసీఆర్‌... పెద్ద నోట్ల ర‌ద్దు కార‌ణంగా తెలంగాణ స‌ర్కారు ఎదుర్కొన్న ఇబ్బందుల‌ను కూడా మోదీ ముందు పెట్టిన‌ట్టు చెప్పారు. అస‌లు పెద్ద నోట్ల‌ను ర‌ద్దు చేస్తూ న‌రేంద్ర మోదీ తీసుకున్న సంచ‌లనాత్మ‌క నిర్ణ‌యంతో తెలంగాణ కాళ్లు విరిగిపోయిన‌ట్లుగా అయ్యింద‌ని చెప్పిన కేసీఆర్‌... ఆ వెంట‌నే త‌మ ప్ర‌భుత్వం పెద్ద నోట్ల ర‌ద్దు ప్ర‌భావాన్ని బాగానే త‌ట్టుకుంద‌ని కూడా మోదీకి చెప్పార‌ట‌. పెద్ద నోట్ల ర‌ద్దు త‌ర్వాత మోదీతో మాట్లాడిన తొలి సీఎంను తానేన‌ని చెప్పిన కేసీఆర్... నోట్ల ర‌ద్దు వ‌ల్ల తెలంగాణ‌కు పెద్ద‌గా న‌ష్ట‌మేమీ జ‌ర‌గ‌లేద‌ని మోదీకి చెప్పిన‌ట్లుగా వెల్ల‌డించారు. నోట్ల్ ర‌ద్దుతో త‌మ కాళ్లు విరిగిపోయిన ఫీలింగ్ క‌లిగింద‌న్న భావ‌న‌తో తాను మోదీతో 'ఆప్‌ నే మేరే టాంగ్ తోడ్‌ దియే' అని చెప్పిన‌ట్లు పేర్కొన్నారు. పెద్ద నోట్ల రద్దు వల్ల మోటారు వాహనాల పన్నుల రీత్యా కొంత ఆదాయం తగ్గింది తప్ప.. తెలంగాణ రాష్ట్రానికి మరీ పెద్ద ఎక్కువ నష్టం ఏమీ జరగలేదని ఆయ‌న వెల్ల‌డించారు.

రాష్ట్రంలో తాము మొత్తం 31 జిల్లాలను ఏర్పాటు చేసుకున్నామని, రియల్ ఎస్టేట్ బూమ్ బ్రహ్మాండంగా ఉండి ఆదాయం ఊపందుకుందని, సరిగ్గా అదే సమయంలో పెద్ద‌ నోట్లను రద్దు చేశార‌ని, అంతేకాకుండా కొత్త నోట్ల అందుబాటు కూడా తక్కువగా ఉండటంతో రియల్ ఎస్టేట్ రంగం కుదేలై తన కాళ్లు విరగ్గొట్టినట్లు అయ్యిందన్న విషయాన్ని తాను మోదీకి వివరించానని చెప్పారు. అదేంటని ఆయన అడగ్గా, పూర్తి విషయం వివరించానని, గుజరాత్ కంటే కూడా ఎక్కువ వృద్ధి రేటుతో మంచి ఆదాయం సాధించినందుకు తనను మోదీ అభినందించి, కొట్లాడి సాధించుకున్న రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తోందంటూ ప్రశంసించారని తెలిపారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/