Begin typing your search above and press return to search.
బిగ్ బ్రేకింగ్: లాక్ డౌన్ మే 29 వరకు పొడిగిస్తూ కేసీఆర్ నిర్ణయం
By: Tupaki Desk | 5 May 2020 4:42 PM GMTలాక్ డౌన్ ను దేశం ప్రకటించిన దాన్ని పట్టించుకోకుండా ప్రజలను రక్షించుకునే దానిలో భాగంగా లాక్ డౌన్ పొడిగిస్తున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. లాక్ డౌన్ మే 29వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు వెల్లడించారు. ప్రజలకు కోపం వచ్చినా కూడా అందరి ఆరోగ్యం దృష్ట్యా లాక్ డౌన్ పొడిగిస్తున్నట్లు వివరించారు. లాక్ డౌన్ ను ఎప్పటిలాగే సహకరించాలని.. లాక్ డౌన్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఎదుర్కొంటారని హెచ్చరించారు. రాష్ట్రంలో కరోనా వైరస్ తగ్గుముఖం పట్టిందని.. కరోనా కట్టడిలో తెలంగాణ ఆదర్శంగా నిలుస్తోందని తెలిపారు.
మంగళవారం మధ్యాహ్నం నుంచి ప్రారంభమైన మంత్రివర్గ సమావేశం రాత్రి 9.30గంటల వరకు కొనసాగింది. మంత్రివర్గంలో సుదీర్ఘ చర్చ చేశారు. సమావేశం ముగిసిన వెంటనే రాత్రి సీఎం కేసీఆర్ రాష్ట్రంలో కరోనా బులెటిన్ విడుదల చేశారు. తాజాగా 11 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని - వీటితో కలిపి 1,096కు చేరాయని తెలిపారు. 43 మంది డిశ్చార్జయ్యారని తెలిపారు. ప్రస్తుతం యాక్టివ్ గా ఉన్న కేసులు 439 అని వెల్లడించారు.
కరీంనగర్ జిల్లాలో కరోనా వైరస్ ను కట్టడి చేశారని.. సింగిల్ డెత్ లేకుండా కరీంనగర్ జిల్లా నిలిచిందని తెలిపారు. రాష్ట్రంలో కరోనా కట్టడి చర్యలు రాష్ట్రంలో పక్కాగా తీసుకుంటున్నామని - కలెక్టర్ - వైద్యారోగ్య శాఖ అధికారులు అందరూ సమన్వయంతో పని చేస్తున్నట్లు వారికి అభినందనలు తెలుపుతున్నట్లు ప్రకటించారు.
అత్యంత జనాభా సాంద్రత ఉన్న హైదరాబాద్ - రంగారెడ్డి - మేడ్చల్ జిల్లాలో అధికంగా కరోనా కేసులు ఉన్నాయని తెలిపారు. మొత్తం కేసుల్లో 726 ఈ జిల్లాల నుంచే ఉన్నాయని అవి మొత్తం 66శాతం ఉన్నాయని - 29 మంది మృతుల్లో 25మంది ఆ ప్రాంతాల్లోనే ఉన్నాయని వెల్లడించారు.