Begin typing your search above and press return to search.
లాక్ డౌన్ మే 7 వరకు పొడిగింపు - ఆన్ లైన్ ఫుడ్ సర్వీసులు బంద్!
By: Tupaki Desk | 19 April 2020 10:22 PM ISTతెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ ను మే 7వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆదివారం ప్రకటించారు. మే 5వ తేదీన సమీక్షించి మరోసారి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఏప్రిల్ 20వ తేదీ తర్వాత తెలంగాణలో ఎలాంటి సడలింపులు లేవని స్పష్టం చేశారు. గతంలోని లాక్ డౌన్ నిబంధనలు యథాతథంగా కొనసాగుతాయన్నారు. ఆయా రాష్ట్రాల పరిస్థితులను బట్టి సడలింపులపై నిర్ణయం తీసుకోవాలని కేంద్రం సూచించిందని - ఈ మేరకు తెలంగాణలోని పరిస్థితుల దృష్ట్యా లాక్ డౌన్ ను పొడిగిస్తున్నట్లు చెప్పారు.
మే 7వ తేదీ వరకు ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలకు కూడా అనుమతి రద్దు చేస్తున్నట్లు తెలిపారు. రేపటి నుండే ఈ నిబంధనలు అమలులోకి వస్తాయని స్పష్టం చేశారు. ఏ మతానికి సంబంధించిన పండుగలైనా పరిమిత సంఖ్యలో ఇళ్లలోనే జరుపుకోవాలన్నారు. రంజాన్ మాసం అయినప్పటికీ సామూహిక ప్రార్థనలకు అనుమతి లేదన్నారు.
పోలీసులకు సీఎం ప్రోత్సాహకం కింద గ్రాస్ వేతనంలో 10 శాతం ఎక్కువగా చెల్లిస్తామని చెప్పారు. ప్రయివేటు విద్యా సంస్థలు ట్యూషన్ ఫీజు తప్ప అదనపు ఫీజు తీసుకోవద్దని సూచించారు. విద్యా సంవత్సరం ఫీజు మొత్తం ఒకేసారి కట్టాలని ఒత్తిడి చేయవద్దని - నెలవారీగా తీసుకోవచ్చునని చెప్పారు. ఒత్తిడి చేస్తే డయల్ 100కు ఫిర్యాదు చేయవచ్చునని చెప్పారు.
అలాగే, విపత్తుల నిర్వహణ చట్టం ప్రకారం అద్దెకు ఉండేవారి నుండి డబ్బులు వసూలు చేయరాదని కేసీఆర్ స్పష్టం చేశారు. మూడు నెలల వరకు అద్దెను డిమాండ్ చేయవద్దన్నారు. ప్రభుత్వం ఆదేశాలు పట్టించుకోకుంటే చర్యలు తీసుకుంటామని చెప్పారు. మూడు నెలల తర్వాత అద్దె ఇచ్చే సమయంలో వడ్డీని వసూలు చేయవద్దన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా కుటుంబాలకు ఇప్పుడు రూ.1500 ఇచ్చినట్లే మే నెలలోను ఇస్తామని చెప్పారు. ప్రతి తెల్ల రేషన్ కార్డుదారుకు 12 కిలోల బియ్యం ఉచితంగా ఇస్తున్నట్లు తెలిపారు. వలస కార్మికులకు కూడా రూ.500 - 12 కిలోల బియ్యం - ఒకరి కంటే ఎక్కువ మంది కుటుంబ సభ్యులు ఉంటే ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యం - రూ.1500 ఇస్తామన్నారు. రైతులు మే 5వ తేదీ నుండి ఎరువులు కొనుగోలు చేసుకోవచ్చునని చెప్పారు. మరణాలు - కేసుల సంఖ్య చాలా రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణలో కాస్త బెట్టర్ అన్నారు.