Begin typing your search above and press return to search.
ఏపీ విభజనలో ముఖ్య పాత్ర..ఐఏఎస్ కు కేసీఆర్ కీలక బాధ్యత
By: Tupaki Desk | 2 Dec 2019 1:48 PM GMTఛత్తీస్ గఢ్ తొలి సీఎస్ గా శివరాజ్ సింగ్ అనే అధికారి ఉండేవారు. రిటైర్ అయినా ఆయనపై ఉన్న ప్రేమ - ఆయన అందించిన సేవలకు గుర్తుగా ఆయనకు క్యాబినెట్ హోదా ఇచ్చి - ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా పెట్టుకున్నారు. పదమూడున్నరేళ్లు అవుతున్నా.. ఆయన ఇంకా ఆ పదవిలోనే కొనసాగుతున్నారు. రాజీవ్ శర్మ సేవలను కూడా తెలంగాణ రాష్ట్రం మధురంగా హృదయంలో దాచుకుని గుర్తుపెట్టుకుంటుంది. రాజీవ్ శర్మ సేవలను మనం ఇంకా తీసుకోవాల్సిన అవసరం ఉంది. సీనియర్ ఐఏఎస్ అధికారిగా ఆయన బ్యాట్స్ మన్ వలే వ్యవహరించారని అంటున్నారు కాదు ఆయనో ఆల్ రౌండర్. అందుకే ఆయన పదవీ విరమణ చేసినప్పటికీ....ఆయన సేవలు ప్రభుత్వం వాడుకోవాలని భావిస్తోంది. అందుకే ఆయనను చీఫ్ అడ్వైజర్ టూ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణగా నియామకం చేస్తున్నాం`` ఇది రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా రాజీవ్ శర్మ పదవీ విరమణ చేసిన సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన కామెంట్. ఆ ప్రత్యేక అభిమానాన్ని చాటుకుంటూ..మళ్లీ ఆయనకు పొడగింపు ఇచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా రాజీవ్ శర్మ పదవీకాలాన్ని కేసీఆర్ ప్రభుత్వం మరో నాలుగేళ్లు పొడగించింది. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి బోర్డు చైర్మన్ గా కూడా రాజీవ్ శర్మ నాలుగేళ్లు కొనసాగుతారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శైలేంద్రకుమార్ జోషి ఉత్తర్వులు జారీచేశారు. అయితే, ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ అధికారికి ఇంత ప్రాధాన్యం ఇవ్వడం వెనుక కారణమేంటి? అనేది ప్రతి ఒక్కరిలోనూ కలిగే సందేహం. దానికి సచివాలయంలో ప్రభుత్వం ఘనంగా నిర్వహించి రాజీవ్ శర్మ ఆత్మీయ వీడ్కోలు సభలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలే సమాధానం ఇస్తాయి.
``తెలంగాణ బిల్లు డ్రాఫ్ట్ అయ్యే టైమ్ లో హోంశాఖలో అడిషనల్ సెక్రటరీగా రాజీవ్ శర్మ ఢిల్లీలో ఉన్నారు. విభజన చట్టంలోని ప్రతి క్లాజ్ - ప్రతి పేజీపై ఆయనకు పూర్తి అవగాహన ఉంది. అందువల్లనే ఏపీతో వచ్చే సమస్యలు - కేంద్రంతో జరిగే వ్యవహారాలు చాలా అలవోకగా మాట్లాడి.. రాష్ర్టానికి అవసరమైనదంతా సమకూర్చి పెట్టారు. వారి గొప్ప మనసేందంటే ఉన్నదున్నట్లుగా మాట్లాడడం. తెలంగాణ ప్రజలు వివాదాలు చేసే వాళ్లు కాదు.. మంచి మననున్న వాళ్లు, హృదయం ఉన్న వాళ్లు - మంచి పద్ధతి ఉన్నవాళ్లు అని తాను ఏ ప్రజలకైతే ప్రధాన కార్యదర్శిగా ఉన్నారో.. ఆ ప్రజలకు సర్టిఫికెట్ ఇచ్చారు.`` అని కేసీఆర్ రాజీవ్ శర్మ గురించి విశ్లేషించారు. అంత బాగా ఆయన్ను అధ్యయనం చేశారు కాబట్టే ప్రభుత్వ ప్రధాన సలహాదారు నియామకం....తాజాగా ఈ నాలుగేళ్ల కొనసాగింపు కూడా!