Begin typing your search above and press return to search.
రైతు బంధు అమలు కష్టమే..సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం!
By: Tupaki Desk | 26 Dec 2019 9:49 AM GMTతెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతు బంధు పథకం పై తాజాగా సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. 2018లో రైతుబంధు ప్రారంభించిన సమయంలో ఏడాదికి ఎకరాకు రూ.8 వేల చొప్పున పెట్టబడి సాయం అందిచారు. గత అసెంబ్లీ ఎన్నికల హామీ నేపథ్యంలో 2019లో దాన్ని రూ.10 వేలకు పెంచారు. సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోని అమలు చేస్తున్న ఈ పథకం ఇప్పుడు ప్రభుత్వానికి పెద్ద సమస్యగా మారింది. ప్రస్తుతం దేశం ఆర్థిక మాంద్యం తో ఇబ్బంది పడుతుంది. ఈ నేపథ్యంలో ఈ పథకానికి నిధులు కేటాయించడం చాలా కష్టమవుతోంది. దీనితో ఇకపై సీజన్ ల వారీ చెల్లింపులకు స్వస్తి చెప్పి ఏడాది పొడవునా సాయమందేలా కొత్త ప్లాన్ తయారు చేసారా?అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది.
రైతుబంధు పథకం ఒక్క దఫా చెల్లింపుకు దాదాపు ఏడు వేల కోట్లు ఖర్చు అవుతుంది. అంటే ఏడాదికి సుమారు 14 వేల కోట్లు కావాలి. కానీ , ప్రస్తుతం రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో ఇది చాలా కష్టం. ఈ నేపథ్యంలో రైతుబంధు చెల్లింపులో కొత్త పద్ధతిని అమలు చేయాలని నిర్ణయించారని తెలిసింది. ఇప్పటివరకు అర్హులైన ప్రతి ఒక్కరికి ఒకేసారి అకౌంట్ లో డబ్బులు వేసేవారు. కానీ , ఇకపై ముందుగా చిన్న రైతులకు ఆ తరువాత మిగతా వారికి డబ్బుని ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. అంటే ఏడాది పొడువునా రైతు సాయం అందేలా కొత్త పద్దతి అమలు చేయబోతున్నారు. ఇలా చేస్తే ఆర్థికంగా కొంచెం వెసులుబాటు ఉంటుంది అని ప్రభుత్వం భావిస్తుంది. గత ఏడాది రైతు బంధు కింద ఖరీప్ కాలానికి ఖరీప్ లోనే - రబీ కాలానికి చెందిన డబ్బులు రబీ కాలంలో వేసారు.
కానీ, ఈ ఏడాది ఖరీప్ - రబీ కాలాలు మారిపోతున్నా రైతులకు ఇంత వరకు రైతు బంధు సాయం ఇవ్వలేదు. దీనితో ముందుగా మూడు ఎకరాల లోపు ఉన్న రైతులకు ఆ తరువాత ఐదు ఎకరాలలోపు ఉన్న వారికి డబ్బు ఇచ్చి, ఆ తరువాత పది ఎకరాల లోపు, ఆపైన ఎక్కువ ఎకరాలున్న వారికి రైతుబంధు పథకం డబ్బులు ఇవ్వాలని నిర్ణయించారు. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడంతో కాలల వారీగా కాకుండా, విడతల వారిగా రైతు బంధు డబ్బులు విడుదల చేయనున్నట్టు సంబంధిత అధికారులు చెప్తున్నారు. ఈ ఏడాది మొదటి విడత రైతుబంధు చెల్లింపులు ఇంకా కొనసాగుతున్నాయి. వీటిని ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని భావిస్తున్నారు. తర్వాత రైతుబంధు రెండో దఫా నిధులు విడుదల చేయనున్నారు. రబీ కాలానికి రైతు బంధు సొమ్ముపై వ్యవసాయ శాఖ వచ్చేవారం బ్యాంకర్లతో సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. రైతు బంధు డబ్బులను ఇతర అప్పుల జమ చేయొద్దని ప్రభుత్వం బ్యాంకులను కోరనుంది. దీనిపై రైతులు ఏ విధంగా రియాక్ట్ అవుతారో మరి.