Begin typing your search above and press return to search.
సేమ్ సీన్; అప్పుడు అమ్మ.. ఇప్పుడు ప్రణబ్ దా
By: Tupaki Desk | 29 Dec 2015 4:25 AM GMTఇవాళ దినపత్రికల్ని తిరగేసే వారి దృష్టిని ఒక ఫోటో ఆకర్షించటం ఖాయం. ఈ ఫోటోను చూసిన కొందరికి పాత గురుతులు గుర్తుకు రావటం ఖాయం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్యామిలీ ఫోటో ఈ రోజు పత్రికల్లో ప్రధానంగా ప్రింట్ అయ్యింది. కేసీఆర్ ఫోటో ప్రింట్ కాని పరిస్థితి ఉందా? అంటూ తొందరపడి ప్రశ్న వేయొచ్చు. కానీ.. ఈ రోజు అచ్చేసింది కేసీఆర్ ఫ్యామిలీ ఫోటో. కేసీఆర్ కుటుంబ సభ్యులంతా దేశ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలుసుకున్నారు. ఆ సందర్భంగా వారంతా ఒక గ్రూప్ ఫోటో దిగారు.
ఈ ఫోటోను చూస్తున్నంతనే ప్లాష్ బ్యాక్ కళ్ల ముందు గిర్రున తిరగటం ఖాయం. 2014 ఫిబ్రవరి నాలుగో వారంలో సరిగ్గా ఇలానే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని ఆమె నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా ఆమె ఇంట కేసీఆర్ విందు చేశారు. అప్పుడే మేడమ్ సోనియాగాంధీతో కలిసి కేసీఆర్ ఫ్యామిలీ ఫోటో దిగింది. అప్పుడు అమ్మతో.. ఇప్పుడు ప్రణబ్ దా ఫోటోలో ఒక్క తేడా స్పష్టంగా కనిపించక మానదు.
నాటి సోనియాగాంధీతో దిగిన గ్రూప్ ఫోటోలో కేసీఆర్ మేనల్లుడు హరీశ్ రావు కుటుంబ సభ్యులు కూడా కనిపిస్తే.. తాజాగా రాష్ట్రపతి ప్రణబ్ దాతో కలిసిన ఫోటోలో మాత్రం మేనల్లుడు కమ్ మంత్రి హరీశ్ ఫ్యామిలీ మిస్ కావటం కనిపించక మానదు. నాడు ఫ్యామిలీగా వెళ్లింది? ఇప్పుడు ఎందుకు వెళ్లనట్లు? పెద్దోళ్లకు సంబంధించి సవాలచ్చ పర్సనల్స్ ఉంటాయి. వాటిని ప్రశ్నించటం ప్రజాస్వామ్యంలో ధర్మం కాదంటారేమో..?