Begin typing your search above and press return to search.
ప్రత్యేక హెలీకాప్టర్ లో తిరుపతికి కేసీఆర్
By: Tupaki Desk | 17 Feb 2017 6:37 AM GMTతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన తిరుపతి పర్యటనకు సంబంధించి ఏర్పాట్లను ఘనంగా ఉండేలా చూసుకుంటున్నట్లు తెలుస్తోంది. గతంలో సుదూర ప్రయణాలు అయితేనే ఉపయోగించే ప్రత్యేక హెలీకాప్టర్‌ను ఈ దఫా తిరుపతి పర్యటనకు తీసుకువెళ్లనున్నట్లు సమాచారం. తెలంగాణ ఉద్యమం సమయంలో రాష్ట్రం ఏర్పడితే తిరుమల బాలాజీకి ఆభరణాలు సమర్పిస్తానని కేసీఆర్ మొక్కుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఫిబ్రవరీ 21న తిరుమలకు కుటుంబ సభ్యులతో కలిసి కేసీఆర్ వెళ్తున్నారు. 21వ తేదీ రాత్రి అక్కడికి చేరుకునే కేసీఆర్ 22వ తేదీన వెంకటేశ్వరుడిని దర్శనం చేసుకుంటారు. అదే రోజు తిరిగి హైదరాబాద్ వచ్చేస్తారు. కుటుంబ సభ్యులతో పాటు ఒకరిద్దరు మంత్రులతో కలిసి వెళుతున్న కేసీఆర్ ఈ ఆధ్యాత్మిక పర్యటనకు హెలీకాప్టర్ ను ఉపయోగించుకుంటున్నారని తెలుస్తోంది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తాను మొక్కులు తీర్చుకుంటానని కేసీఆర్ ఉద్యమకారుడిగా ఉన్న సమయంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. రాష్ట్రం ఏర్పడిన సందర్భంగా 2015 జనవరి 30న జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ ప్రతిపాదనను పాస్ చేయించారు. రూ.5.59 కోట్ల ఖర్చుతో తెలంగాణలోనే కాదు ఆంధ్రప్రదేశ్ లోనూ ఉన్న వివిధ దేవాలయాలకు మొక్కులు చెల్లించుకోవడం, ఆయా దేవతలకు బంగారు ఆభరణాలు చేయించడానికి ఈ మొత్తాన్నిమంజూరు చేశారు. ఈ మేరకు మొదటి మొక్కును కేసీఆర్ చెల్లించుకున్నారు. వరంగల్‌లోని భద్రకాళి అమ్మవారి నవరాత్రుల సందర్భంగా 11 కిలోల ఏడు వందల గ్రాముల బంగారు కిరీటాన్ని బహుకరించారు. మూడు కోట్ల డెబ్బై లక్షల రూపాయల విలువ కలిగిన స్వర్ణ కిరీటాన్ని సీఎం కేసీఆర్ సమర్పించారు. కాగా... మొత్తం 5.59 కోట్లలో మిగతా సొమ్ములతో తిరుపతి వెంకటేశ్వరునికి బంగారు తాపడంతో చేసిన మూలవర్ణకమలము చేయించేందుకు కేటాయించారు. మిగతా సొమ్ములతో విజయవాడ కనకదుర్గమ్మ, తిరుచానురు పద్మావతి అమ్మవారు, భద్రకాళి అమ్మవారుకు ఆభరణాలు చేయించేందుకు ఉద్దేశించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/