Begin typing your search above and press return to search.
త్వరలో మార్కెట్లోకి కేసీఆర్ బొప్పాయ్
By: Tupaki Desk | 6 July 2016 10:43 AM GMTతెలంగాణరాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ లో ఒక చక్కటి రైతు ఉన్నారన్న విషయం తెలిసిందే. ఆయన ఎంతో ప్రేమించే ఫాంహౌస్ లో క్రియేటివ్ గా పంటలు వేసి.. భారీ లాభాలు కళ్ల జూసే తత్వం ఉన్న ఆయన.. ఆ మధ్యన క్యాప్సికం.. ఆ తర్వాత అల్లం పంటల్ని వేయటం తెలిసిందే. వినూత్న రీతిలో పంటల్ని ఎంపిక చేసుకోవటం.. ఆధునిక పద్ధతిలో వ్యవసాయం చేయటం ద్వారా భారీ దిగుబడి వచ్చేలా ప్లాన్ చేసే కేసీఆర్.. తాజాగా తన ఫాంహౌస్ లో మరో కొత్త పంటను వేయాలని నిర్ణయించుకున్నారు.
ఇప్పటివరకూ వేసిన పంటలకు భిన్నంగా.. ఈసారి బొప్పాయి పంటను వేయాలని ఆయన భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన పనులు వేగంగా సాగుతున్నాయని చెబుతున్నారు. ఈ పంటకు అవసరమైన సామాగ్రిని సిద్ధం చేశారని.. ఈ పంటను వేసే సమయంలో తానే దగ్గరుండి చూసుకునేలా ఆయన మరోసారి ఫాంహౌస్ కి వెళ్లారు. ఇప్పటివరకూ మార్కెట్లకి కేసీఆర్ ఫాంహౌస్ పండించిన క్యాప్సికం.. అల్లం పంటలు రాగా.. రానున్న రోజుల్లో బొప్పాయి కూడా మార్కెట్లో రానుందన్న మాట.
ఇదిలా ఉంటే.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉన్న కేసీఆర్ తరచూ ఫాంహౌస్ కి వెళ్లటంపై విపక్షాలు తీవ్రస్థాయిలో విరుచుకుపడటం తెలిసిందే. తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ కేసీఆర్ పై ధ్వజమెత్తుతూ.. తెలంగాణ రాష్ట్రంలో ప్రజల కష్టాల్ని పట్టించుకునే కన్నా.. ఫాంహౌస్ లో పంటలు ఎలా పండుతున్నాయన్నదే కేసీఆర్ కు ముఖ్యంగా మారిందంటూ మండిపడ్డారు. నిజానికి పొంగులేటి ఒక్కరే కాదు.. పలువురు నేతలు కేసీఆర్ తరచూ ఫాంహౌస్ కి వెళ్లటాన్ని తప్పు పడుతున్నారు. ఈ విషయంలో కేసీఆర్ పునరాలోచించుకుంటే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.