Begin typing your search above and press return to search.
రేవంత్ పై పోటీకి దిగిన రాజశేఖర్ రెడ్డి ఎవరంటే?
By: Tupaki Desk | 22 March 2019 5:45 AM GMTఅతి పెద్ద ఎంపీ స్థానంగా చెప్పే మల్కాజిగిరిలో ఎన్నికల పోరు ఆసక్తికరంగానే కాదు.. ఉత్కంటను రేకెత్తించేలా మారింది. దీనికి కారణం బరిలోకి దిగుతున్న అభ్యర్థులేనని చెప్పాలి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ తన బలం ఎంతన్న విషయాన్ని స్పష్టం చేయటంతో పాటు.. తన సత్తాను చాటింది. ఇదే సమయంలో ఆపరేషన్ ఆకర్ష్ అస్త్రాన్ని సంధిస్తూ కాంగ్రెస్ కు ఊపిరి ఆడనివ్వకుండా చేస్తోంది.
ఇలాంటి సమయంలో జరుగుతున్న ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికలో పార్టీలు జాగ్రత్తగా వ్యవహరించాయి. మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ తన ఫైర్ బ్రాండ్ రేవంత్ ను బరిలోకి దింపింది. దీంతో.. అప్పటివరకూ ఆ స్థానానికి నవీన్ రావుకు టికెట్ ఖాయమని భావించినా.. అందుకు భిన్నంగా రాజశేఖర్ రెడ్డికి ఇచ్చారు.
ఇంతకీ ఈ రాజశేఖర్ రెడ్డి ఎవరంటే.. ప్రముఖ విద్యాసంస్థల ఛైర్మన్ గా.. తెలంగాణ రాష్ట్ర కార్మిక.. ఉపాధి శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్న మల్లారెడ్డి అల్లుడిగా చెప్పాలి. మామ మాదిరే అల్లుడు కూడా వివిధ విద్యాసంస్థలకు నేతృత్వం వహిస్తున్నారు. ఆర్థికంగా ఫుల్ సౌండ్ ఆయన్ను గెలిపించుకునే బాధ్యతను మంత్రి మల్లా రెడ్డి తీసుకోవటంతో ఆయన కోరిన విధంగా కేసీఆర్ టికెట్ కన్ఫర్మ్ చేసినట్లుగా చెబుతున్నారు.
రేవంత్ రెడ్డి పేరు ప్రకటించక ముందే ఈ స్థానాన్నినవీన్ రావుకు కేటాయించాలని కేసీఆర్ భావించినట్లు చెబుతారు. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి ఎంట్రీ ఇచ్చారో దాంతో తన వ్యూహాన్ని మార్చుకొన్నట్లుగా తెలుస్తోంది. ఏమైనా.. రేవంత్ కు ధీటైన అభ్యర్థిని కేసీఆర్ బరిలోకి దింపారని.. మరి తుది ఫలితం ఎలా ఉంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.