Begin typing your search above and press return to search.

కేంద్రానికి మరో షాక్ ఇవ్వడానికి కేసీఆర్ రె‘ఢీ’

By:  Tupaki Desk   |   1 Sep 2022 11:30 PM GMT
కేంద్రానికి మరో షాక్ ఇవ్వడానికి కేసీఆర్ రె‘ఢీ’
X
కేంద్రంలోని బీజేపీ.. తెలంగాణ సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేసింది. తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వానికి వ్యతిరేకంగా దూకుడు పెంచింది. తెలంగాణ బీజేపీ ఇప్పుడు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుపై దాడిని ముమ్మరం చేసింది. ఇప్పటికే కేసీఆర్ కూతురు కవితను ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇరికించేసింది. ఈ క్రమంలోనే తెలంగాణలోకి కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ ఎంట్రీని కేసీఆర్ నిషేధించబోతున్నట్టు తెలిసింది. బీహార్ పర్యటనలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు చూసిన తర్వాత అందరిలోనూ ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి.

తన ప్రత్యర్థులను వేధించడానికి, ప్రత్యర్థులను లొంగదీసుకోవడానికి నరేంద్రమోడీ సర్కార్ కేంద్ర దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఈడీ, ఐటీలను యథేచ్ఛగా వాడుకుంటున్నాయనే ఆరోపణలు అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగానే బీహార్ లోకి సీబీఐ ఎంట్రీని నిషేధించడాన్ని కేసీఆర్ మద్దతు ఇచ్చారు.

శాంతిభద్రతలన్నది రాష్ట్రాల పరిధిలోని అంశం కాబట్టి సీబీఐని దేశవ్యాప్తంగా నిషేధించాలని కేసీఆర్ డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే సీబీఐ ఎంట్రీని నిషేధిస్తూ పశ్చిమ బెంగాల్, చత్తీస్ ఘడ్, రాజస్థాన్, పంజాబ్ , మేఘాలయతోపాటు మరికొన్ని రాష్ట్రాలు నిషేధించాయి.

తాజాగా ఇచ్చిన పిలుపును గమనిస్తే తెలంగాణలోకి సీబీఐ ఎంట్రీని కేసీఆర్ నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంటారనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఢిల్లీలో వెలుగుచసిన లిక్కర్ స్కాంలో కేసీఆర్ కూతురు కవిత పేరు ప్రముఖంగా వినిపడుతోంది. ఇద్దరు బీజేపీ ఎంపీలు లిక్కర్ స్కాంలో కవితపై ఆరోపణలు చేశారు. ప్రస్తుతానికి కవితపై రాజకీయ పరమైన ఆరోపణలే ఉన్నప్పటికీ కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ బాగా దూకుడుగా వెళుతున్నది. ఏదో రోజు కవిత దగ్గరకు కూడా సీబీఐ వచ్చే ప్రమాదముందని కేసీఆర్ భయపడుతున్నట్టు తెలుస్తోంది.

సీబీఐ ఎంట్రీని కేసీఆర్ నిషేధిస్తే ఆ సంస్థ హైకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. మామూలు పరిస్థితుల్లో రాష్ట్రప్రభుత్వం అనుమతి లేకుండా సీబీఐ ఎంట్రీ ఇవ్వొచ్చు. కానీ కేసీఆర్ కూతురు కవితకు ముప్పు వాటిల్లితుండడంతో ఇప్పుడు సీబీఐని కేసీఆర్ నిషేధించే అవకాశం ఉంది. మరి ఈ వార్ లో ఎవరు నెగ్గుతారన్నది వేచిచూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.