Begin typing your search above and press return to search.

ఆర్భాటాలకు దూరంగా కేసీఆర్ నామినేషన్

By:  Tupaki Desk   |   14 Nov 2018 10:40 AM GMT
ఆర్భాటాలకు దూరంగా కేసీఆర్ నామినేషన్
X
ఆయన అధికార పార్టీ సీఎం క్యాండిడేట్.. ఆయన నామినేషన్ వేస్తున్నాడంటే ఎలా ఉండాలి.. ఊరు.. వాడ దద్దరిల్లిపోవాలి.. ముసలి ముతక నాట్యమాడుతూ ఎదురెల్లి స్వాగతం పలకాలి... పూల వాన కురవాలి. . దారిపొడవునా గులాబీ కార్యకర్తల హర్షధ్వానాల మధ్య ఎదురేగుతూ నామినేషన్ వేయాలి.. అందరూ అలానే ఆశించారు. కానీ అక్కడున్నది కేసీఆర్.. ప్రత్యర్థులకు, సామాన్యులకు అందని విధంగా రాజకీయాల్లో వ్యూహరచన చేసే కేసీఆర్.. తాజాగా గజ్వేల్ ఎమ్మెల్యేగా అంతే సింపుల్ గా నామినేషన్ కార్యక్రమాన్ని ముగించి ఆశ్యర్యపరిచాడు.

అపద్ధర్మ ముఖ్యమంత్రి హోదాలో, టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. ఆయన ఇష్టదైవమైన కోనాయిపల్లిలోని శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకున్న అనంతరం గజ్వేల్ ఆర్డీవో కార్యాలయానికి చేరుకున్నారు. రిటర్నింగ్‌ అధికారికి నామినేషన్‌ పత్రాలు సమర్పించారు. ఈ నామినేషన్ దాఖలు సందర్భంగా ఎలాంటి హంగు ఆర్బాటాలు పెట్టుకోకుండా సింపుల్ గా కానిచ్చేశాడు కేసీఆర్..

కోనయపల్లి గ్రామస్థులు, హరీష్ రావు మాత్రమే కేసీఆర్ వెంట ఉన్నారు. ఆ ఊళ్లోని గుడిలో చాలా సాదా సీదాగా పూజలు చేసి అక్కడే సంతకాలు పెట్టి గజ్వేల్ వెళ్లిపోయారు. ఓ సర్పంచ్ నామినేషన్ వేస్తే ఎంత తక్కువ హడావుడి ఉంటుందో అలా కేసీఆర్ ముగించేయడం అందరినీ ఆశ్చర్యపరించింది.

కేసీఆర్ సరిగ్గా 2.24 గంటలకు నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందజేశారు. టీఆర్ఎస్ నేత హరీష్ రావుతోపాటు.. ఐదుగురు సాధారణ కార్యకర్తల సమక్షంలో కేసీఆర్ నామినేషన్ వేయడం విశేషం.జాతకాలు బాగా పాటించే కేసీఆర్ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు మకరలగ్నం.. మధ్యాహ్నం 1.30 నుంచి 2.50వరకు కుంభలగ్నం.. ఈ రెండు ముహూర్తాల్లో నామినేషన్ వేస్తే రాజయోగమని నమ్మి అదే ముహూర్తంలో నామినేషన్ కార్యక్రమం పూర్తి చేయడం విశేషం.