Begin typing your search above and press return to search.

మాంద్యం వేళ తెలంగాణ బడ్జెట్ లెక్క చెప్పిన కేసీఆర్

By:  Tupaki Desk   |   9 Sep 2019 7:49 AM GMT
మాంద్యం వేళ తెలంగాణ బడ్జెట్ లెక్క చెప్పిన కేసీఆర్
X
ఆర్థిక మాంద్యం.. అన్న మాటను గడిచిన కొద్ది కాలంగా వింటున్నా.. అదెంత తీవ్రంగా ఉందన్న విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తన బడ్జెట్ ప్రసంగం ద్వారా చెప్పేసి ప్రజల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేశారు. దేశ ఆర్థిక పరిస్థితి బాగోలేదని.. అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ భారీగా పడిపోయిందన్న ఆయన.. కేంద్రం అనుసరిస్తున్న ఆర్థిక విధానాలతో ఇప్పటి పరిస్థితి నెలకొందన్నారు.

సంక్లిష్ట పరిస్థితులు చుట్టుముట్టిన వేళ తాను బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నందుకు చింతిస్తున్నట్లు చెప్పి బడ్జెట్ వివరాల్ని వెల్లడించారు. ఆయన ప్రసంగంలోని బడ్జెట్ హైలెట్స్ ను చూస్తే..

% 2014 జూన్‌ లో నూతన రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది. ఐదేళ్ల స్వల్ప వ్యవధిలోనే రాష్ట్రం అద్భుతమైన ప్రగతిని సాధించింది. దేశంలోనే తెలంగాణ అగ్రగామి రాష్ట్రంగా నిలిచింది. వినూత్నమైన పథకాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోంది.

% రాష్ట్రం ఏర్పడినప్పుడు నిర్దిష్టమైన ప్రతిపాదికలు ఏమీ లేవు. తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రం ఆర్థికంగా దృఢంగా మారింది. 2013-14లో జీఎస్‌డీపీ విలువ 4,51,581 కోట్లు. రాష్ట్ర జీఎస్‌డీపీ వృద్ధిరేటు 4.5శాతం నుంచి 10.2శాతానికి పెరిగింది. ఐదేళ్లలో తెలంగాణ సంపద రెట్టింపు అయింది.

% వివిధ ఆర్థిక సంస్థలిచ్చిన నిధులను మూలధన వ్యయంగా ఖర్చు చేశాం. నిధులను ఖర్చు చేసే విషయంలో ప్రభుత్వం నిబద్ధతతో ఉంది. గత ఐదేళ్లలో పెట్టుబడి వ్యయం ఆరురెట్లు పెరిగింది. సమర్థవంతమైన ఆర్థిక విధానం వల్ల అన్ని రంగాలకు నిరంతర విద్యుత్‌ సరఫరా అందిస్తున్నాం.

% వ్యవసాయ రంగానికి 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్‌ ఇస్తున్నాం

% రాష్ట్ర రైతాంగం కోసం రైతుబంధు - రైతు బీమా పథకాలను అమలు చేస్తున్నాం

% రాష్ట్రంలో 6.3శాతం అదనపు వృద్ధి రేటను సాధించాం

% వ్యవసాయ రంగంలో 2018-19నాటికి 8.1శాతం వృద్ధిరేటును నమోదుచేశాం

% ఐటీ రంగంలో 2018-19 నాటికి 11.05శాతం వృద్ధిరేటు సాధించాం

% 2018-19నాటికి లక్షా 10 వేల కోట్ల ఐటీ ఎగుమతులు నమోదయ్యాయి

% మిషన్‌ కాకతీయ ద్వారా వేలాది చెరువులను పునరుద్ధరించాం

% వందలాది గురుకులాల్లో లక్షలాది విద్యార్థులకు కార్పొరేట్‌ విద్య అందుతోంది

% కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు కోసం అందినవి కేవలం రూ. 31,802 కోట్లు మాత్రమే. అభివృద్ధి సంక్షేమం కోసం ఈ ఐదేళ్లలో రూ. 5,37,373 కోట్లు ఖర్చు చేశాం.

% ఆసరా పెన్షన్ల కోసం రూ. 9,402 కోట్లు కేటాయించాం.

% రైతుబంధు పథకానికి రూ. 12వేల కోట్ల కేటాయింపులు జరిపాం.

% మొత్తంగా పన్నేతర ఆదాయం 29శాతం తగ్గింది. ఈ ఆర్థిక సంవత్సరం 6.61శాతం వృద్ధి మాత్రమే సాధ్యమైంది. కేంద్రానికి పన్నుల ద్వారా వచ్చే ఆదాయంలో 1.36శాతం వృద్ధి మాత్రమే సాధ్యమైంది. గతంలో ప్రవేశపెట్టిన ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ అంచనాలకు నేటికీ చాలా వ్యత్యాసముంది.

% తెలంగాణకు జీఎస్టీ పరిహారం తీసుకోవాల్సిన అవసరం రాలేదు. కానీ తర్వాత మాత్రం తప్పలేదు. జూన్‌ నెలలో తీసుకున్న జీఎస్టీ పరిహారం ఏప్రిల్‌ - మే నెలల కంటే నాలుగు రెట్లు ఎక్కువ. దేశంలో నెలకొన్న ఆర్థిక సంక్షోభ ప్రభావం తెలంగాణపై కూడా పడింది. రూపాయి మారకం విలువ దారుణంగా పడిపోయింది.

% దేశవ్యాప్తంగా వాహనాల ఉత్పత్తి 33శాతం తగ్గింది. వాహనాల అమ్మకాలు 10.65శాతం తగ్గాయి. తీవ్రమైన ఆర్థిక మాంద్యం దేశంలోని అన్ని రంగాలపై ప్రభావం చూపుతోంది. భీకరమైన జీవన విధ్వంసం నుంచి తెలంగాణ కుదుటపడింది. తెలంగాణపైనా ఆర్థిక సంక్షోభ ప్రభావం.

% పాలమూరు-రంగారెడ్డి - సీతారామ ప్రాజెక్టులు యధాతథంగా కొనసాగుతాయి.

ముఖ్య కేటాయింపులు ఇలా..

- 2019-20 ఏడాది ప్రతిపాదిత వ్యయం రూ.1,46,492 కోట్లు

- రెవెన్యూ వ్యయం రూ.1,11, 055 కోట్లు

- మూలధన వ్యయం రూ. 17,274 కోట్లు

- మిగులు బడ్జెట్‌ అంచనా రూ.2,044 కోట్లు

- ఆర్థిక లోటు రూ.24,081 కోట్లు

- ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ప్రతిపాదనలు రూ.1,82,017 కోట్లు

- ఆసరా పెన్షన్లకు రూ.9,402 కోట్లు

- గ్రామపంచాయతీలకు రూ.2,714 కోట్లు

- మునిసిపాలిటీలకు రూ. 1,764 కోట్లు

- విద్యుత్ సబ్సిడీలకు రూ.8 వేల కోట్లు

- రైతు రుణాల మాఫీకి రూ.6 వేల కోట్లు

- రైతుబంధుకు రూ.12 వేల కోట్లు

- రైతు బీమా కోసం రూ.1125 కోట్లు

- ఆరోగ్యశ్రీకి రూ.1,336 కోట్లు