Begin typing your search above and press return to search.
'బీజేపీ ముక్త్ భారత్' తప్పదు.. కేసీఆర్ పిలుపు
By: Tupaki Desk | 31 Aug 2022 11:30 PM GMTకేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారును గద్దె దింపేందుకు బీజేపీ వ్యతిరేక శక్తులు ఏకం కావాలని తెలంగా ణ సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. బీజేపీ ముక్త్ భారత్ కోసం కలిసి పని చేస్తామని స్పష్టం చేశారు. బీజేపీ పాలనలో దేశం తీవ్రంగా నష్టపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ముక్త్ భారత్ కోసం కలిసి రావాల ని బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్‌ను కోరినట్లు తెలిపారు. బిహార్ పర్యటనలో ఉన్న కేసీఆర్.. పట్నాలో మీడియాతో మాట్లాడారు.
నీతీశ్ కూడా బీజేపీ ముక్త్ భారత్ కోరుకుంటున్నారని కేసీఆర్ వెల్లడించారు. ప్రపంచ దేశాల ముందు దేశ పరువు తీస్తున్నారని మండిపడ్డారు. ``అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్లు హామీ ఏమైంది. బీజేపీ వ్యతిరేక శక్తులు ఏకం కావాలి. రొటీన్ ప్రభుత్వాలు వద్దు.. భారత్‌ను మార్చే ప్రభుత్వం రావాలి. బీజేపీ పాలనలో దేశం తీవ్రంగా నష్టపోయింది. అబద్ధాలతో పాలన సాగిస్తున్నారు. విపక్షాలను ఏకం చేసే విషయమై నీతీశ్‌తో చర్చించా. విద్వేషాలు సృష్టించే శక్తులు దేశానికి క్షేమకరం కాదు`` అని వ్యాఖ్యానించారు.
చైనాతో పోల్చితే మనం ఎక్కడ ఉన్నామని కేసీఆర్ ప్రశ్నించారు. విద్వేషం పెరిగితే దేశానికి నష్టమని అన్నారు. బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదింపాల్సిందేనని నొక్కి చెప్పారు. సమృద్ధిగా జలాలు ఉన్నా జల యుద్ధాలు ఆగట్లేదన్నారు.
నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయని, దేశంలో సహజ వనరులు పుష్కలంగా ఉన్నాయని, దేశ ప్రజలకు కనీసం తాగునీళ్లు ఇవ్వట్లేదని నిప్పులు చెరిగారు. ఢిల్లీలోనూ తాగునీరు, విద్యుత్ సమస్య పరిష్కరించలేదన్నారు.
దేశ ప్రజలకు కనీసం తాగునీళ్లు ఇవ్వలేని పరిస్థితుల్లో ప్రధాని మోడీ సర్కార్ ఉందని సీఎం కేసీఆర్ విమర్శించారు. బీజేపీ పాలనలో దేశం ఏ రంగంలోనూ అభివృద్ధి సాధించలేదని మండిపడ్డారు. మోడీ సర్కారును ఇంటికి పంపాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఎనిమిదేళ్ల మోడీ పాలనలో దేశం పూర్తిగా నష్టపోయిందని ముఖ్యమంత్రి ఆరోపించారు. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ పతనమైందని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తానికి బిహార్ పర్యటనలోనూ.. కేసీఆర్ మోడీపై కామన్‌గా చేసేవిమర్శలే చేయడం గమనార్హం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.