Begin typing your search above and press return to search.

ఆరేళ్ల తర్వాత కూడా.. ఆంధ్రోళ్లను తిట్టిన కేసీఆర్

By:  Tupaki Desk   |   1 Jan 2020 11:26 AM GMT
ఆరేళ్ల తర్వాత కూడా.. ఆంధ్రోళ్లను తిట్టిన కేసీఆర్
X
ఎవరైనా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఎలా చెబుతారు.. ‘మీ పిల్లా పాప.. గొడ్డు గోదా కొత్త సంవత్సరంలో బాగుండాలని.. అంతా మంచి జరగాలని.. బాగు పడాలని.. మీరు ఇంకా పైకి ఎదగాలని’ కోరుకుంటారు.. కానీ కేసీఆర్ స్టైలే వేరు.. కొత్త సంవత్సరంలోనూ పాత గాయలు మళ్లీ రేపి ఆందోళ్లను మళ్లీ తిట్టడానికి ఉపయోగించుకోవడం గమనార్హం.

రాష్ట్రం విడిపోయింది. ఆరేళ్లవుతోంది.. నేను అభివృద్ధి చేశానని చెప్పుకుంటే అదో లెక్క కానీ.. ఇదే రోజున కేసీఆర్ తెలంగాణ లో ఒక కొత్త పథకాన్ని ప్రకటించారు. అదే ‘ఈచ్ వన్ టీచ్ వన్’.

నూతన సంవత్సరం సందర్భంగా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు చెబుతూ 100శాతం అక్షరాస్యత సాధించేందుకు కేసీఆర్ ఈ ‘ఈచ్ వన్ టీచ్ వన్’ కొత్త పిలుపునిచ్చారు. అందరూ ప్రతిన బూని ప్రతీ ఒక్కరూ నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మారాల్చని సూచించారు.

ఇదే క్రమంలో ఆంధ్రోళ్లపై కేసీఆర్ అక్కసు వెళ్లగక్కారు. ‘గత పాలకులు అందరినీ అక్షరాస్యులను చేయడంలో విఫలం కావడం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందని.. తెలంగాణలో నిరక్షరాస్యులు ఎక్కువగా ఉండడానికి ఆంధ్రా పాలకులే కారణమన్నట్టు ప్రకటనలో పేర్కొన్నారు.

ఇలా తెలంగాణ ఉద్యమానికే కాదు.. అక్కడ జనాలు చదువుకోక పోవడానికి కూడా ఆంధ్రోళ్లే కారణమని..అదీ ఆరేళ్లు పాలించాక కేసీఆర్ కు బోధపడడం నిజంగా మన ధౌర్భాగ్యమని ఆంధ్రులు ఒకింత బాధతోనే బయటపడుతున్నారు.