Begin typing your search above and press return to search.
చంద్రబాబుకు అధికారమిస్తే ఇంటికొచ్చి కొడతాడు!
By: Tupaki Desk | 27 Nov 2018 8:00 AM GMTతెలంగాణ ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్-టీడీపీ పొత్తు ఖరారైనప్పటి నుంచి గులాబీ దళపతి కేసీఆర్ ప్రధానంగా చంద్రబాబు నాయుడిని లక్ష్యంగా చేసుకుంటున్నారు. ప్రజా కూటమిలో ప్రధాన పక్షమైన కాంగ్రెస్ పై కంటే టీడీపీ అధినేత చంద్రబాబుపైనే తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. వలసవాదిని తరిమికొడదాంటూ రాష్ట్ర ప్రజలు పిలుపునిస్తున్నారు.
వరంగల్‌లో సోమవారం జరిగిన బహిరంగ సభల్లోనూ ఇదే పంథాను కేసీఆర్ కొనసాగించారు. చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. తెలంగాణ ప్రజల్ని ప్రలోభ పెట్టేందుకు చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ నుంచి లారీల నిండా చీప్ లిక్కర్ పంపిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిరూపించుకోవాల్సిన సమయం మరోసారి ఆసన్నమైందన్నారు. మన గడ్డపై వలస రాజకీయం చెల్లదని చంద్రబాబుకు గట్టిగా బుద్ధి చెప్పాలని సూచించారు. మనలో మనకు ఏమైనా ఉంటే తర్వాత చూసుకుందామని.. మొదట వలసవాదుల ఆధిపత్యాన్ని మాత్రం నిరాకరించాలని పిలుపునిచ్చారు.
తనతో పోటీకి తెలంగాణ కాంగ్రెస్ నేతలు భయపడ్డారని కేసీఆర్ ఎద్దేవా చేశారు. అందుకే ఏపీ నుంచి చంద్రబాబును తీసుకొచ్చారని అన్నారు. చంద్రబాబుకు అధికారం అప్పగిస్తే ఆయన తెలంగాణలో ఇంటింటికీ తిరిగి మరీ ప్రజలను కొడతారని హెచ్చరించారు. అలాంటి వ్యక్తికి ఏమాత్రం అవకాశమివ్వకూడదని హితవు పలికారు. ప్రతి ప్రాజెక్టు మీద కేసులు వేసే చంద్రబాబు మనకు అవసరమా అని ప్రశ్నించారు. చిల్లర రాజకీయాల కోసం చంద్రబాబు ఆత్మగౌరవాన్ని పక్కనపెట్టి కాంగ్రెస్ తో కలిశారని ఎద్దేవా చేశారు. ఇక తెలంగాణలో టీఆర్ ఎస్ 106 స్థానాల్లో విజయం సాధిస్తుందని తాజాగా ఓ సర్వే వెల్లడించిందని కేసీఆర్ చెప్పారు.