Begin typing your search above and press return to search.

మీడియా హౌస్ పై కేసీఆర్ సీరియస్..?

By:  Tupaki Desk   |   28 Oct 2018 3:30 PM GMT
మీడియా హౌస్ పై కేసీఆర్ సీరియస్..?
X
నిప్పు లేనిదే పొగరాదు కదా.. పొగ వచ్చిందే అక్కడ నిప్పేదే ఉందని అనుమానించాల్సిందే.. కానీ గులాబీ పార్టీలో అలాకాదు.. నిప్పును అంటిపెట్టుకొని పొగ వచ్చాక ఆ పొగ మాది కాదు అంటూ దబాయిస్తున్నారట.. అవును గులాబీ జంపింగ్ లపై అధినేత కేసీఆర్ తాజాగా సీరియస్ అయినట్టు తెలిసింది. ఎవరో ఒకరు పార్టీ మారుతున్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరగడం.. తాజాగా ఓ పత్రికలో కథనం రావడంతో కేసీఆర్ షాక్ కు గురయ్యాడట.. ప్రతీ రాఖీ పండుగకు కేసీఆర్ కు రాఖీ కడుతూ చెల్లెలుగా టీఆర్ఎస్ లో చెలామణీ అవుతున్న తుల ఉమ పార్టీ మార్పు కథనాలపై కేసీఆర్ సీరియస్ అయినట్టు తెలిసింది. ఆమెను పిలిపించి పార్టీ మారడం లేదని నిర్ధారించుకొని.. తప్పుడు కథనాలు రాసిన సదురు మీడియా హౌస్ కు వార్నింగ్ కూడా ఇచ్చినట్టు వార్తలు వెలువడుతున్నాయి.. ఇంతకీ తెరవెనుక ఏం జరిగింది.?

తెలంగాణ రాష్ట్రసమితి మహిళా అధ్యక్షురాలు తుల ఉమ.. తనకు వేములవాడ నియోజకవర్గ టికెట్ ఇవ్వలేదని ఇటీవల జగిత్యాల జిల్లా మేడిపల్లిలో కేటీఆర్ నిర్వహించిన ఆశీర్వాద సభకు హాజరుకాలేదు. కేసీఆర్ ను అన్నా అని పిలుస్తూ ఉద్యమకాలం నుంచి ఉన్న ఆమె రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. కరీంనగర్ పూర్వపు జిల్లాలో ఎక్కడ సభ అయినా అక్కడ వాలిపోయే తుల ఉమ రాకపోవడంతో అందరూ ఆమె పార్టీ మారబోతోందని ప్రచారం చేశారు.

కాంగ్రెస్, బీజేపీలు వేములవాడ టికెట్ ను కూడా తుల ఉమకు ఆఫర్ చేశాయట. అక్కడి తాజామాజీ టీఆర్ఎస్ ఎమ్మెల్యే రమేష్ బాబుపై తీవ్ర వ్యతిరేకత, అసమ్మతి వ్యక్తమవుతున్న నేపథ్యంలో స్థానికురాలైన తుల ఉమ పోటీచేస్తే గెలుస్తుందని భావించారు. అయితే కాంగ్రెస్ పై పోటీకి ఆమె కుటుంబ సభ్యులు ఒత్తిడి తెచ్చినా.. కేసీఆర్ పై నమ్మకం.. అనాధిగా ఉన్న సత్సబంధాలతో తుల ఉమ నిరాకరించారట.. తాను పార్టీ మారడం లేదని.. తప్పుడు ప్రచారం చేశారని విలేకరులతో చెప్పింది.

ఆ తర్వాత కేసీఆర్ వార్త ప్రచురించిన సదురు మీడియా హౌస్ కు గట్టిగానే క్లాస్ తీసుకున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.. టీఆర్ఎస్ ముఖ్య నేతల పార్టీ మార్పు పై వార్తలు రాసేటప్పుడు కనీసం వారి వివరణ కూడా తీసుకోకుండా ఎలా ప్రచురిస్తారని మండిపడ్డట్టు తెలిసింది. ఇక నుంచి గులాబీ నేతల వలసలు ఉన్నాయంటే ఖచ్చితంగా మారే వాళ్ల అభిప్రాయం తీసుకొనే రాయండి అంటూ సీరియస్ అయినట్టు ప్రచారం జరుగుతోంది.