Begin typing your search above and press return to search.

మంత్రులపై కేసీఆర్ ఉగ్రనరసింహావతారం

By:  Tupaki Desk   |   3 Feb 2017 6:32 AM GMT
మంత్రులపై కేసీఆర్ ఉగ్రనరసింహావతారం
X
తెలంగాణ ప్రభుత్వానికి తిరుగులేదన్న మాట అధికారుల్లోనే కాదు.. తెలంగాణ రాజకీయ పక్షాల్లో వినిపిస్తున్న వేళ.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం మరోలా ఫీలవుతున్నారట. ప్రభుత్వంపై ముప్పేట దాడి జరుగుతుందని.. అయినా మంత్రులెవ్వరూ పట్టించుకోవటం లేదన్న ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎవరికి వారు ఏమీ పట్టనట్లుగా వ్యవమరించటం.. అన్నింటికి తానే సమాధానం చెప్పాల్సి రావటంపై ఆయన గుర్రుగా ఉండటమే కాదు.. తాజాగా నిర్వహించిన టీ క్యాబినెట్ భేటీకి ముందు ప్రత్యేకంగా మంత్రులతో మాట్లాడిన సందర్భంలో మాటలతో ఉతికి ఆరేశారన్న మాట వినిపిస్తోంది.

గతంలో ఎప్పుడూ లేని విధంగా కేసీఆర్ ఆగ్రహాన్నిప్రదర్శించినట్లుగా చెబుతున్నారు. పలువురు మంత్రుల పనితీరును ప్రదర్శించటమే కాదు.. వారి తప్పుల చిట్టాను విప్పి.. ఇలాంటి తీరుతో ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకు వస్తానంటే ఒప్పుకునేది లేదని.. తాను చేయాల్సింది చేస్తానన్న హెచ్చరికను చేసినట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకొచ్చే వారిని వదిలిపెట్టేది లేదన్న మాటను చెప్పటంతో పాటు.. కొందరు మంత్రుల కుటుంబ సభ్యులు చేస్తున్న పైరవీలను ప్రశ్నించినట్లుగా చెబుతున్నారు.

ఓపక్కతెలంగాణ ప్రభుత్వం మీద కోదండరాం.. ఉత్తమ్ కుమార్ రెడ్డి.. సీపీఎం తమ్మినేని వీరభద్రం ప్రజల్లోకి తిరుగుతూ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతుంటే.. ఎవరూ ఎందుకు ప్రశ్నించటం లేదన్న సూటి ప్రశ్నను సంధించినట్లుగా తెలుస్తోంది. ఇలాంటి సమావేశాల్లో సాధారణంగా చాయ్ ఇచ్చేందుకు బాయ్ లను అనుమతిస్తుంటారు. కానీ.. తాజాగా మాత్రం వారిని సైతం లోపలకు రానివ్వకుండా క్లాస్ పీకటం గమనార్హం. దాదాపు గంట పాటు సాగిన ఈస్పెషల్ క్లాస్ కు మంత్రులు కాస్త చిన్నబోయినట్లుగా తెలుస్తోంది.

మంత్రివర్గ సమావేశంలో చర్చించే అంశాల్ని బయటకు రానివ్వకుండా జాగ్రత్త తీసుకోవాల్సి ఉన్నప్పటికీ.. లోపల మాట్లాడుకున్నవన్నీ బయటకు ఎలా వస్తున్నాయి? అన్న ప్రశ్నను వేయటమే కాదు..సమావేశం పూర్తి అయ్యే వరకూ ఎవరూ బయటకు వెళ్లటానికి వీల్లేదని ఆదేశించినట్లుగా చెబుతున్నారు. మంత్రులందరికి స్పెషల్ గా పీకిన కేసీఆర్ క్లాస్ అధికారపక్షంలో ఇప్పుడు సరికొత్త చర్చకు దారి తీసింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/