Begin typing your search above and press return to search.
నీచ..దద్దమ్మ..దుర్మార్గ..అబద్ధాలకోరు..లఫంగి!
By: Tupaki Desk | 30 Dec 2018 6:12 AM GMTసినిమాల్లో కొన్ని హిట్ పెయిర్స్ ఉంటాయి. రాజకీయాల్లో కూడా. అయితే.. దేశంలో చాలా తక్కువ మంది సీనియర్ రాజకీయ నేతలకు ఉన్నట్లే.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఒక ఇబ్బంది ఉంది. ఆయన్ను ఎవరైనా ఈజీగా టార్గెట్ చేయగలరు. రాజకీయ నేతలకు విమర్శలు కొత్తేం కాకున్నా.. బాబును ఎవరు తిట్టినా వినేందుకు వినసొంపుగా ఉంటుంది.
సోషల్ మీడియాలో కమెడియన్ బ్రహ్మనందం ఏ ఎక్స్ ప్రెషన్ కు అయినా.. ఏ పోస్ట్ కు అయినా అతికినట్లుగా సరిపోతారు. చంద్రబాబు కూడా ఇంతే. ఆయన్ను ఎవరు తిట్టినా సరే.. ఆ విమర్శలకు.. ఆరోపణలకు అతికినట్లుగా ఉంటారు. ఇక.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తిడుతుంటే.. బాబుకు వీర ఫ్యాన్స్ సైతం కాస్తంత శ్రద్ధగానే వింటారు. ఆయన మాటల్లో నిజం ఉన్నట్లుగా ఆయన మాటలు ఉంటాయి.
బాబును తిట్టేసిన తర్వాత కేసీఆర్ కు కౌంటర్ ఇచ్చేందుకు కాస్తంత కసరత్తు చేయక తప్పని పరిస్థితి. తాజాగా ప్రెస్ మీట్ పెట్టిన కేసీఆర్ ఒక రేంజ్లో బాబుపై నిప్పులు చెరిగారు. బాబును తిట్టేందుకు ఏ దశలోనూ వెనక్కి తగ్గని ఆయన.. ఇష్టం వచ్చినట్లుగా తిట్టిపారేశారు. నీచ.. దద్దమ్మ.. దుర్మార్గ లాంటి పదాల్ని అలవోకగా వాడేశారు.
బాబును కేసీఆర్ ఎలా తిట్టారన్నది చూస్తే..
+ చంద్రబాబంతా డర్టీయస్ట్ పోలిటిషియన్ ఇవాళ దేశంలో ఎవరూ లేదు. నవీన్ పట్నాయక్ ను ఎందుకు కలిశావు, ఎల్లయ్యను ఎందుకు కలిశావు - మల్లయ్యను ఎందుకు కలిశావు... అవన్నీ ఆయనకేం అవసరం? నాలుగేళ్లు మోదీసంకలో ఉన్నావు. అప్పుడు మేం మోదీని పొగడాలా. ఇప్పుడు నువ్వు రాహుల్ సంకలోకి ఎక్కగానే... మేమూ కాంగ్రెస్ వెంబడి రావాలా? రాహుల్ గాంధీ విజయవాడ వస్తున్నాడంటే ఏ ముఖం పెట్టుకుని వస్తున్నాడని ప్రశ్నించాడు. నిన్న నరేంద్ర మోదీ వస్తున్నాడంటే ఏ ముఖం పెట్టుకుని వస్తున్నాడని మాట్లాడుతున్నాడు. అసలు నీదేం మొఖం నాకర్థం కాదు
+ బాబు లాంటి డర్టీ పొలిటీషియన్ ను భరిస్తున్నందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చేతులెత్తి మొక్కాలి. ఎన్ని పచ్చి అబద్ధాలు! సిగ్గుపడాలి చంద్రబాబు! కనీసం లజ్జా - సిగ్గు అనేవి ఉండాలి చంద్రబాబుకు!
+ చంద్రబాబు ఇష్టమొచ్చినట్లు పేలుతున్నాడు. ఆయన నోటికి మొక్కాలి. రాష్ట్రం విడిపోయి అయిదేళ్లు అయ్యింది. మెడకాయ మీద తలకాయ ఉన్న ఏ నాయకుడైనా వాళ్ల ప్రజలకు ఇబ్బంది కలగకుండా వాళ్ల హైకోర్టు వాళ్ల దగ్గరకు మార్చుకోవాలి. ఈ అడ్డగోలు మాటలకు ఏమైనా అర్థముందా? చంద్రబాబుకు మెదడు ఉన్నట్లా - లేనట్లా? ఏది పడితే అది మాట్లాడితే చెల్లుతుందని ఆయన అనుకోవడం... దానికి ఒకటి రెండు పత్రికలు బాకా కొట్టడం! ప్రతి రోజూ ఇదే జరుగుతుంది. తెలుగు రాష్ట్రాలలో ఇదో పెద్ద డ్రామా అయిపోయింది
+ చంద్రబాబు యూజ్ అండ్ త్రోలో నంబర్ వన్. మొన్న అమాయకురాలైన హరికృష్ణ బిడ్డ ను నిలబెట్టాడు. ఇప్పుడేమైనా న్యాయం చేస్తావా ఆ అమ్మాయికి? ఏమీ చేయడు. ఎన్నికల ముందు వాడుకోవాలి అంతే!
+ చంద్రబాబులాగా దిక్కుమాలిన రాజకీయాలు నేను చేయలేదు. నేను మాట్లాడింది ఫెడరల్ ఫ్రంట్ గురించి. కాంగ్రెస్ లేని - బీజేపీ లేని ఫ్రంట్ రావాలని నొక్కి వక్కాణించి చెబుతున్నా! దానికోసం నాయకులను కలుస్తున్నా. అన్నీ బయటకు చెప్పం కదా?
+ ఫెడరల్ ఫ్రంట్ ఒక మహాయజ్ఞం. ఈ ఎఫర్ట్ అర్భక రాజకీయ నాయకులకు, చిల్లరగాళ్లకు అర్థం కాదు. ఒక పద్ధతి అనుకున్నప్పుడు వంద శాతం ఒక ప్రాతిపదిక ఏర్పడాలి. అంతిమంగా అది దేశానికి లాభం చేయాలి. మేం క్రియేట్ చేసే ఎజెండాను మిగిలిన పార్టీలు అందుకోవాలి. మా కూటమిలోకి ఎవరైనా రావచ్చు. సీపీఎం - సీపీఐ - జగన్ మోహన్ రెడ్డి ఎవరైనా రావొచ్చు. (చంద్రబాబు రావచ్చా అన్నప్పుడు) చూస్తాం! ఆలోచిస్తాం. ఈ లఫంగి గాళ్లను తీసుకుంటామా!
+ చంద్రబాబుకు నాలుగు వాక్యాలు చక్కగా ఇంగ్లిష్ లో మాట్లాటం వస్తుందా? రెండు సెంటెన్స్ లు హిందీలో మాట్లాడటం వస్తుందా? ఇక... ఢిల్లీలో చక్రం ఎలా తిప్పాలి? అంతా ఒట్టిదే.. డొల్ల. చక్రం లేదు - చింపింది లేదు. చచ్చింది లేదు!

Watch Here: పవన్ కళ్యాణ్ పావలా అయితే నీ రేటు ఎంత..?