Begin typing your search above and press return to search.

కేసీఆర్‌ను ఆ సాయం అడిగితే తిట్లే

By:  Tupaki Desk   |   15 Aug 2015 5:52 AM GMT
కేసీఆర్‌ను ఆ సాయం అడిగితే తిట్లే
X
కేసీఆర్ ఎంత ముక్కు సూటిగా ఉంటారో కొన్ని విష‌యాల్లో అంతే ప‌ట్టుద‌ల‌గా ఉంటారు. ఆయ‌న అనుకున్న‌ది సాధించేవ‌ర‌కు నిద్ర‌పోరు. త‌న‌కు న‌చ్చ‌ని విష‌యంపై ఎవ‌రు ఎదురు చెప్పినా అస్స‌లు స‌హించ‌రు. ఆయ‌న కొద్ది రోజుల క్రితం న‌గ‌రంలో జూదాన్ని ఉక్కు పాదంతో అణిచివేస్తాన‌ని చెప్పారు. ఈ విష‌యంపై పోలీసుల‌కు చాలా సీరియ‌స్‌ గా ఆదేశాలు జారీ చేశారు. హోట‌ళ్లు, లాడ్జిల‌లో పేకాడుతున్న కొంద‌రు ప్ర‌ముఖుల‌ను పోలీసులు ప‌ట్టుకుంటే వారి స‌న్నిహితులైన ఎమ్మెల్యేలు నేరుగా కేసీఆర్‌ కే ఫోన్ చేసి ఈ విష‌యంలో పోలీసుల‌ను చూసీ చూడ‌న‌ట్టు ఉండ‌మ‌న్నార‌ట‌.

దీంతో ఆయ‌న‌కు చిర్రెత్తుకొచ్చి ఆ ఎమ్మెల్యేల‌ను నోటికొచ్చిన‌ట్టు చెడామ‌డా తిట్టేశార‌ట‌. తాజాగా పోలీసులు దెబ్బ‌కు పేకాట‌రాయుళ్లు ర‌న్నింగ్ కారులో పేకాడే కొత్త సంస్కృతికి తెర‌లేపారు. ఔట‌ర్ రింగు రోడ్డుపై పేకాడినా ప‌క్కా నిఘాతో పోలీసులు ప‌ట్టుకోవ‌డంతో వారు రూట్‌ను నాగార్జునాసాగ‌ర్‌, శ్రీశైలం హైవేల‌పైకి మార్చారు.

అయితే ఆ పేకాట‌రాయుళ్ల‌కు అక్క‌డ కూడా చుక్కెదురైంది. శుక్ర‌వారం పోలీసులు వారి కార్ల‌ను ఆపి త‌నిఖీ చేయ‌గా వారు రెడ్ హ్యాండెడ్‌ గా దొరికిపోయారు. వారి వ‌ద్ద నుంచి రెండులక్షల నగదుతోపాటు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. దొరికిన పేకాట రాయుళ్లు అధికార పార్టీ మంత్రుల‌కు స‌న్నిహితుల‌వ్వ‌డంతో వారు ఈ విష‌యంలో హెల్ఫ్ చేయ‌మ‌ని కేసీఆర్‌ ను అడిగేందుకు భ‌య‌ప‌డిపోతున్నార‌ట‌. ఎందుకు అన‌వ‌స‌రంగా సాయం చేయ‌మ‌ని అడిగి తిట్లు తిన‌డం అని వారు మిన్న‌కుండిపోయార‌ట‌.