Begin typing your search above and press return to search.
ఉత్తమ్ తప్పుచేయకుండా కేసీఆర్ కాపాడారట!
By: Tupaki Desk | 6 Nov 2017 11:09 AM GMTఅంశం ఏదైనా...అనర్గళంగా ప్రసంగించడం...అద్భుతంగా తన వాదనను సమర్థించుకోవడం టీఆర్ ఎస్ అధినేత - తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చాలా తేలిక అనే సంగతి తెలిసిందే. ఇక అందులోనూ తనకు ప్రీతిపాత్రమైన అంశం అయితే...కేసీఆర్ రియాక్టయ్యే విధానమే...వేరుగా ఉంటుంది. అలాంటి తనకు ఆసక్తికరమైన అంశంపై స్పందిస్తూ ఇటీవలి కాలంలో తనకు పంటికింద రాయిలా మారిన టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. అది కూడా అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ ఈ ప్రస్తావన తెచ్చారు.
ఇంతకీ కేసీఆర్ కు నచ్చిన - అసెంబ్లీ సాక్షిగా ప్రస్తావనకు వచ్చిన అంశం ఏమిటంటే...భూరికార్డుల ప్రక్షాళన. భూరికార్డులపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ రైతు సమన్వయ సమితి ఆధ్వర్యంలో భూ రికార్డుల ప్రక్షాళన జరుగుతుందని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే భట్టి వ్యాఖ్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ తప్పుబట్టారు. రైతు సమన్వయ సమితుల ఆధ్వర్యంలో రికార్డుల ప్రక్షాళన జరగడం లేదన్నారు. సమన్వయ సమితుల పని వేరు - రికార్డుల ప్రక్షాళన వేరు అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. సమన్వయ సమితులను భూ రికార్డుల ప్రక్షాళనలో జోక్యం చేసుకోవాలని ఎక్కడా చెప్పలేదని సీఎం తెలిపారు. భట్టి విక్రమార్క సభను తప్పుదోవ పట్టిస్తున్నారని సీఎం పేర్కొన్నారు. మైక్ ఇచ్చారని ఏదో ఒకటి మాట్లాడితే బాగుండదని కేసీఆర్ అన్నారు. అసలు విషయం వదిలిపెట్టి.. సంబంధం లేని విషయాలపై మాట్లాడటం సరికాదని స్పష్టం చేశారు.
అసైన్డ్ భూములు ప్రభుత్వం ఎక్కడ లాక్కున్నదో చెప్పాలని సీఎం కేసీఆర్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అసైన్డ్ భూములను లాక్కున్నదని సీఎం తెలిపారు. గత ప్రభుత్వాల వైఫల్యంతోనే ఈ కష్టాలు వచ్చాయన్నారు. స్వయంగా పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తండ్రి పురుషోత్తమ్ రెడ్డి అమ్మిన భూములకు రికార్డు లేదని ఆ విషయంలో తప్పు దొర్లకుండా తాము చేశామన్నారు. ఉత్తమ్ తండ్రి సాదా బైనామాతో సర్వే నెంబర్ 220లో ఒక ఎకరా 30 కుంటల భూమిని గిరిజన వ్యక్తి ధరావత్ హన్మంత్ నాయక్ కు అమ్మారని సీఎం కేసీఆర్ వివరించారు. భూ సర్వే సమయంలో.. హన్మంత్ నాయక్ అధికారుల దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. అప్పుడు రెవెన్యూ అధికారులు.. ఉత్తమ్ కుమార్ రెడ్డిని సంప్రదించి విషయాన్ని తెలియజేశారని చెప్పారు. ఆ భూమిని హన్మంత్ పేర పట్టా చేసేందుకు ఉత్తమ్ కూడా అంగీకరించడంతో ఆనాటి పని... మొన్న పూర్తి అయిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రికార్డుల ప్రక్షాళన జరిగితే ఈ సమస్యలు ఎందుకు వస్తాయని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. ప్రభుత్వానికి నిర్మాణాత్మకమైన సలహాలు - సూచనలు ఇవ్వాలి కానీ.. ప్రతి విషయాన్ని వ్యతిరేకించడం ప్రధాన ప్రతిపక్ష సభ్యులకు తగదని సీఎం కేసీఆర్ అన్నారు.
ఈ సందర్భంగా టీవీలకు కేసీఆర్ థ్యాంక్స్ చెప్పారు. అసెంబ్లీ సమావేశాలు ఎప్పటికప్పుడు టీవీల్లో ప్రసారం కావడంతో తాము బతికిపోతున్నామని సీఎం పేర్కొన్నారు. ఏ సభ్యుడు ఏం మాట్లాడుతున్నారో ప్రజలందరూ చూస్తున్నారని సీఎం తెలిపారు. ఈ లైవ్ టెలికాస్ట్ వల్ల తాము బతికిపోయామని...ప్రజలను - రైతులను - సభను తప్పుదోవ పట్టించడం సరికాదని సీఎం కేసీఆర్ అన్నారు.