Begin typing your search above and press return to search.
ప్రాజెక్టుల ఖాతాలోకి జంపింగ్స్ లెక్కనా కేసీఆర్
By: Tupaki Desk | 10 May 2016 4:45 AM GMTసమయానికి అనుకూలంగా మాటలు చెప్పే అలవాటు ఉన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వాదన ఎంత బలంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏదైనా అంశం మీద ఆయన వాదన వినిపిస్తే.. ఎదుటోడు ఎన్ని తప్పులు చేశారో గుక్క తిప్పుకోకుండా వివరిస్తుంటారు. తాజాగా ఆయన తెలంగాణలో తెలుగుదేశం పార్టీ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు ఎందుకు ఖాళీ అయ్యారో చెప్పుకొచ్చారు. కాకుంటే.. ఆయన చెప్పిన మాటల్లో లాజిక్ ఏ మాత్రం లేకపోగా.. ఆయన చెబుతున్న మాటలు కౌంటర్ వేసేందుకు వీలుగా ఉండటం గమనార్హం. తెలంగాణ రాష్ట్ర సర్కారు చేపట్టిన ప్రాజెక్టులపై ఏపీ అధికార.. విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.
దీనిపై తాజాగా స్పందించిన కేసీఆర్.. కాస్త చిత్రమైన వాదనను తెర మీదకు తీసుకొచ్చారు. తెలంగాణ రైతులకు సాగునీరు ఇచ్చేందుకు ప్రాజెక్టులు కడుతుంటే టీడీపీ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు పుల్లలు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయని.. తెలంగాణ ప్రజలు వీరి చేష్టల్ని చూస్తున్నారన్నారు. తెలంగాణకు వ్యతిరేకంగా వీరు చేస్తున్న వ్యాఖ్యల్ని ప్రజలు గమనిస్తున్నారని.. అందుకే ఈ పార్టీలు ఖాళీ అవుతున్నట్లుగా వ్యాఖ్యానించారు. కేసీఆర్ మాటల ప్రకారం చూస్తే.. తెలంగాణలో విపక్ష పార్టీలు ఖాళీ కావటానికి వారు తెలంగాణ ప్రభుత్వం షురూ చేసిన ప్రాజెక్టులపై వ్యతిరేకంగా మాట్లాడటమే అయితే.. ఇక్కడో విషయాన్ని ప్రస్తావించాలి.
గడిచిన రెండేళ్లలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులలో తెలుగుదేశం.. వైఎస్సార్ కాంగ్రెస్ రెండు పార్టీలు వ్యతిరేకించిన ఏకైక తొలి ప్రాజెక్టు పాలమూరు ఎత్తిపోతల పథకం మాత్రమే. నిజానికి తెలంగాణ అధికారపక్షం వైఖరి మీదా.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అనుసరిస్తున్న విధానాల మీద ఎప్పుడూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఎలాంటి విమర్శలు చేయలేదన్నది మర్చిపోకూడదు. పాలమూరు ఎత్తిపోతల పథకానికి వ్యతిరేకంగా తాను దీక్ష చేస్తానంటూ ఏప్రిల్ చివరి వారంలో ప్రకటన చేశారు. మరి.. ఈ మధ్యనే పాలమూరు ప్రాజెక్టుకు వ్యతిరేకంగా గళం విప్పితే.. పార్టీ ఖాళీ కావటం ఎప్పటి నుంచో ఉంది కదా? కేసీఆర్ లాజిక్ ప్రకారం.. తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నందుకే పార్టీ ఖాళీ అవుతున్నట్లుగా చెబుతున్నారు. కానీ.. జగన్ నోరు విప్పటానికి ముందే.. ఆయన పార్టీ ఖాళీ అయ్యింది కదా? ఇదే రీతిలో తెలుగు దేశం పార్టీ పరిస్థితి కూడా. తెలంగాణ ప్రభుత్వ తీరుపై గళం విప్పక ముందే పార్టీ నేతలంతా కారు ఎక్కేసిన విషయాన్ని తెలివిగా పక్కన పెట్టి.. ప్రాజెక్టుల ఖాతాలో జంపింగ్స్ లెక్కను చూపిస్తున్న కేసీఆర్ తెలివితేటల్ని చూసి మురిసిపోవాల్సిందే.