Begin typing your search above and press return to search.
కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ లు!... తొలుత రామోజీకేనా?
By: Tupaki Desk | 3 May 2019 1:23 PM GMTటీఆర్ ఎస్ అదినేత - తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు... ఆ రాష్ట్రానికి వరుసగా రెండో సారి సీఎంగా బంపర్ మెజారిటీతో పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏర్పాటు చేసిన మీడియా సమావేశం గుర్తుంది కదా. తన ఓటమే లక్ష్యంగా తెలంగాణలో అడుగుపెట్టిన టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుపై ఓ రేంజీలో ఫైరయ్యారు. తననే ఓడించడానికి వచ్చి బోల్తా పడిన చంద్రబాబు.... ఆయన అనుచర గణానికి త్వరలోనే రిటర్న్ గిఫ్ట్ లు ఇస్తానంటూ ఆయన చేసిన ప్రకటన పెను కలకలమే రేపింది. అయితే ఏపీలో ఎన్నికలకు రంగం సిద్ధమైన నేపథ్యంలో కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ లను అంతా మరిచిపోయారు గానీ... కేసీఆర్ మాత్రం తాను చేసిన ప్రకటనలను మాత్రం మరిచిపోలేదని తేలిపోయింది. చంద్రబాబు అండ్ కోకు రిటర్న్ గిఫ్ట్ లను రెడీ చేసుకుంటున్న కేసీఆర్... త్వరలోనే వాటిని అమలు చేసేందుకు సిద్ధమవుతున్నారట. ఇందులో భాగంగా కేసీఆర్ తొలి రిటర్న్ గిఫ్ట్ ప్యాకప్ కూడా అయిపోయినట్టుగా తెలుస్తోంది. ఇప్పుడీ విషయం రెండు తెలుగు రాష్ట్రాల్లో వైరల్ గా మారిపోయింది. అయినా కేసీఆర్ అందించే రిటర్న్ గిఫ్ట్ లలో తొలి గిఫ్ట్ అందుకోబోయే వ్యక్తి ఎవరన్న విషయానికి వస్తే... ఈనాడు గ్రూపు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావేనట.
రామోజీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈనాడు... టీడీపీకి అనుకూల పత్రిక కిందే లెక్క. తెలంగాణ ఎన్నికలకు ముందు కేసీఆర్ కు అనుకూలంగా వ్యవహరించినా.. ఎన్నికలు వచ్చినంతమే రూట్ మార్చేసింది. ఎప్పట్లానే టీడీపీ పక్షమే వహించింది. టీడీపీ, కాంగ్రెస్ కూటమి గెలుపు కోసం చేయని యత్నమంటూ లేదు. ఈ పరిణామాలన్నింటినీ ఓ కంట కనిపెడుతూనే సాగిన కేసీఆర్... ఎన్నికలు ముగిసిన తర్వాత అవకాశం ఎప్పుడు దొరుకుతుందా? అని ఎదురు చూశారు. ఆ అవకాశం కూడా ఇప్పుడు రానే వచ్చిందట. దీంతో కత్తి దూసేందుకు కేసీఆర్ రంగం సిద్ధం చేయగా... ఆ విషయాన్ని టీఆర్ ఎస్ సొంత పత్రికగా భావిస్తున్న *నమస్తే తెలంగాణ* చాలా స్ట్రైట్ గానే విషయాన్ని చెప్పేసింది. నేటి తన సంచికలో... ఈనాడులో ప్రచురితమైన ఓ కథనాన్ని బేస్ చేసుకుని సంచలన వార్తనే ప్రచురించేసింది. ఈ కథనంలో ఈనాడు తీరును దునుమాడుతూనే... కోర్టు వ్యాఖ్యలనే వక్రీకరిస్తూ వార్తలు రాస్తుందా? అంటూ ఈనాడును ఘాటుగానే ప్రశ్నించేసింది.
*ఏటిగడ్డ కిష్టాపూర్ ను ఖాళీ చేయాలని హైకోర్టు చెప్పినట్టు ఈనాడు మొదటిపేజీలో బ్యానర్ వార్త రాసింది. కానీ హైకోర్టు ఎక్కడా ఆ విషయం చెప్పలేదు. యంత్రాలు, అధికారులు ఆ దరిదాపుల్లో ఉండొద్దని ఆదేశించినట్టు ఈనాడు పేర్కొంది. కానీ హైకోర్టు న్యాయమూర్తులు ఆ విషయం చెప్పలేదు. హైకోర్టు చెప్పిన విషయాలేవీ ఈనాడులో రాయలేదు. ఈనాడు రాసిన విషయాలేవీ ఇవ్వాళ ఏ పత్రికలూ రాయలేదు. ఈనాడుకు మాత్రమే ఏటిగడ్డ కిష్టాపూర్ ఖాళీ చేయమని హైకోర్టు చెప్పినట్టు కలవచ్చిందా? అలా కావాలని ఈనాడు కోరుకుంటున్నదా? తెలంగాణ ప్రాజెక్టులు ఆగిపోవాలని తహతహలాడుతున్నదా? ఈనాడు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన సమయం వచ్చింది. ఏ అక్కసు? ఏ సంకుచితం? ఏ కడుపుమంట? ఇటువంటి రాతలకు కారణమవుతున్నది? తెలంగాణ ప్రాజెక్టులు ముందు పడకూడదా? కోర్టు చెప్పని మాటలను - న్యాయమూర్తులు అనని మాటలను పత్రిక పతాక శీర్షికల్లో రాయడానికి ఎంత దుస్సాహసం కావాలి? కోర్టు ధిక్కారం కిందికి వస్తుందన్న భయం కూడా లేదా* అంటూ తనదైన శైలి ప్రశ్నల వర్షం కురిపించింది. ఈ లెక్కన ఈనాడుకు కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ రెడీ చేసినట్టేనని, దానికి నిదర్శనమే నమస్తే తెలంగాణ కథనమన్న విశ్లేషణలు సాగుతున్నాయి.