Begin typing your search above and press return to search.
ముంబయిలో కేసీఆర్ ఫ్లెక్సీల జోరు మామూలుగా లేదట
By: Tupaki Desk | 20 Feb 2022 4:12 AM GMTజాతీయ రాజకీయాలు మామూలుగా ఉండవు. బీజేపీకి ప్రత్యామ్నాయంగా కూటమిని ఏర్పాటు చేయాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అందుకు తగ్గట్లే రాష్ట్రాల టూర్లకు వెళ్లాలని డిసైడ్ కావటం.. అందులో మొదటి టూర్ మహారాష్ట్రకు ఈ రోజు వెళుతున్నారు.
ఇందుకోసం భారీ ఎత్తున కసరత్తు పూర్తి చేశారని చెబుతున్నారు. సమాఖ్య తీరుకు తూట్లు పొడిచేలా మోడీ సర్కారు తీరు ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న కేసీఆర్.. అందుకు తగ్గట్లే తన మహారాష్ట్ర టూర్ లో ఆ విషయాన్ని మరింత క్లియర్ గా వెల్లడించనున్నారు.
మోడీ సర్కారు రాష్ట్రాల పట్ల అనుసరిస్తున్న వైఖరిని తప్పు పడుతున్న కేసీఆర్.. దేశ సమగ్రతను కాపాడటానికి.. మతతత్త్వ శక్తులకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగించాలని కోరేందుకు వీలుగా తన తాజా పర్యటనను డిజైన్ చేశారు.
ముంబయి మహానగరంలో సాగే తన టూర్ కు తగ్గట్లే.. గులాబీ బాస్ కు భారీ ఎత్తున స్వాగతం చెప్పేందుకు వీలుగా భారీ ఎత్తున ఫ్లెక్సీలు.. కటౌట్లతో హడావుడి చేయటం గమనార్హం. ఇదిలా ఉంటే.. మహా టూర్ షెడ్యూల్ ను చూస్తే.. ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి ముంబయికి బయలుదేరనున్నారు.
ఎప్పటిలానే ఆయనతో పాటు మేనల్లుడు కమ్ మంత్రి హరీశ్..పార్టీ సీనియర్ నేత కేకే.. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ తో పాటు పలువురు నేతలు ఉన్నారు. తన పర్యటనలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి కమ్ శివసేన చీఫ్ ఉధ్దవ్ ఠాక్రేతో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా ఏయే అంశాల మీద చర్చ జరపాలన్న దానిపైనా ఒక క్లారిటీ తెచ్చుకున్నారు. ఇప్పటికే ఫోన్ లో వారు ప్రాథమికంగా మాట్లాడేసుకున్నారని చెబుతున్నారు.
ఆదివారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరే కేసీఆర్.. మధ్యామ్నం ఒంటి గంట సమయంలో ఉద్ధవ్ ఠాక్రే నివాసమైన వర్షలో ఇద్దరు ముఖ్యమంత్రులు కలవనున్నారు. వారిద్దరూ అక్కడే భోజనం చేస్తారని చెబుతున్నారు.
ఇప్పటికే కేంద్రంలోని మోడీ సర్కారు తీరును మహారాష్ట్రలోని ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం పెద్ద ఎత్తున తప్పు పడుతోన్న సంగతి తెలిసిందే. మోడీ సర్కారుకు వ్యతిరేకత కూటమిని జట్టు కడుతున్న కేసీఆర్ కు తాజా మహా టూర్ కీలకమైనదిగా చెబుతున్నారు.
మధ్యాహ్నం వేళ మహా సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఇంట్లో గడపనున్న ఆయన.. సాయంత్రం వేళకు ఎన్సీపీ అధినేత.. మరాఠా యోధుడు శరద్ పవార్ తో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా వారింటికి వెళ్లనున్న కేసీఆర్.. అక్కడ స్నాక్స్ తీసుకుంటారని చెబుతున్నారు. పవార్ తో కేసీఆర్ కు మంచి సంబంధాలే ఉన్నాయి.
తెలంగాణ ఉద్యమానికి తన మద్దతు తెలిపిన ఆయనతో మోడీ ప్రభుత్వ తీరుపై చర్చలు జరపటంతో పాటు.. వ్యతిరేక జట్టు గురించి కీలక అంశాలు వారి సమావేశంలో రానున్నాయి. ఈ భేటీలోనే మోడీ సర్కారుకు వ్యతిరేకంగా జట్టు కట్టేందుకు వీలుగా ఒక ప్రణాళికను రూపొందించే అవకాశం ఉందంటున్నారు.
మహా పర్యటన తర్వాత పశ్చిమ బెంగాల్..ఒడిశా.. కేరళ.. తమిళనాడులో పర్యటిస్తారని చెబుతున్నారు. మొత్తానికి తన భవిష్యత్తు ప్లాన్ ను అమలు చేసేందుకు రెఢీ అయిన కేసీఆర్ కు మహా పర్యటన అత్యంత కీలకమైనదిగా చెప్పక తప్పదు.