Begin typing your search above and press return to search.
విజయవాడలో కేసీఆర్ భారీ ఫ్లెక్సీ.. ‘హ్యాట్సాఫ్ సీఎం సార్’
By: Tupaki Desk | 26 Feb 2022 11:30 AM GMTఏపీలోని రాజకీయ నగరంగా పేరున్న బెజవాడ నడిబొడ్డున తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిలువెత్తు ఫ్లెక్సీ.. ఏర్పాటైంది. ఏపీలోని పవన్‌కల్యాణ్ అభిమానులు తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ప్రశంసలతో ముంచెత్తారు. విజయవాడలో పవన్ అభిమానులు 'హ్యాట్సాఫ్ సీఎం సార్' అంటూ కేసీఆర్, కేటీఆర్ ఫోటోలతో ఉన్న భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీపై వంగవీటి మోహన్రంగా ఫోటో సైతం ఉండటం ఆసక్తికరంగా మారింది.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రశంసలతో ముంచెత్తారు. భీమ్లానాయక్ సినిమా విడుదలను పురస్కరించుకుని టికెట్ల ధరలు, ఇతర అంశాలపై తెలంగాణ ప్రభుత్వ తీరును మెచ్చుకుంటూ.. విజయవాడలో కృష్ణలంకకు చెందిన పవన్‌కల్యాణ్ అభిమానులు 'హ్యాట్సాఫ్ సీఎం సార్' అంటూ కేసీఆర్, కేటీఆర్ ఫోటోలతో ఉన్న భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేయడం ఆసక్తికరంగా మారింది. ఫ్లెక్సీపై మరోవైపు వంగవీటి రంగా, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ, జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ చిత్రాలు ఉన్నాయి.
మరోవైపు ఏపీ ప్రభుత్వ తీరుపై పవన్‌కల్యాణ్ అభిమానులు భగ్గుమన్నారు. తమ అభిమాన హీరో నటించిన భీమ్లానాయక్ చిత్రాన్ని థియేటర్లలో ప్రదర్శించకుండా ప్రభుత్వం అడ్డంకులు సృష్టించిందని ఆందోళనలకు దిగారు. సీఎంకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పలుచోట్ల నిరసనలు చేపట్టారు.
మంత్రులు కొడాలి నాని, పేర్ని నానికి కృష్ణా జిల్లా గుడివాడలో పవన్ అభిమానుల నిరసనల సెగ తగిలింది. ప్రస్తుత టికెట్ ధరలు గిట్టుబాటు కావని జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ హీరోగా నటించిన భీమ్లానాయక్ చిత్రాన్ని ప్రదర్శించాల్సిన రాష్ట్రంలోని 15 థియేటర్లను వాటి యాజమాన్యాలు మూసేశాయి.
మరో అయిదు థియేటర్లలో ఈ చిత్రానికి బదులుగా వేరే సినిమాలు ప్రదర్శించారు. ఇంకో ఏడు థియేటర్ల లో మధ్యాహ్నం, సాయంత్రం తర్వాత భీమ్లానాయక్ చిత్రాన్ని వేశారు. టికెట్ ధరలు పెంచకుండా థియేటర్లపై అధికారులు నిఘా పెట్టారు. విశాఖలో భీమ్లానాయక్ పోస్టర్‌పైనా తహసీల్దార్ ఫోన్ నంబర్లు రాయించారు. అభిమానుల కోసం ప్రత్యేక ప్రదర్శనలు అనుమతించలేదు. ఈ నేపథ్యంలో కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తూ.. ఏపీలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం.. సంచలనంగా మారింది.