Begin typing your search above and press return to search.
ఇదెక్కడి సలహాదారుల గోల.. జగన్ ను ఫాలో అవుతున్న కేసీఆర్
By: Tupaki Desk | 1 March 2022 4:25 AM GMTరెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ మధ్యన కొత్త అలవాటు ఒకటి వచ్చి చేరింది. ప్రభుత్వాన్ని నడిపేందుకు ఉన్న వారు సరిపోనట్లుగా.. సలహాదారుల పేరుతో పెద్ద ఎత్తున ఉపాధిని కల్పించటం ఈ మధ్యన ఎక్కువైంది.
ఏపీ ప్రభుత్వానికి సలహాదారులుగా ఎంత మంది ఉన్నారన్న దానిపై అక్కడి విపక్షాలు తరచూ విరుచుకుపడుతుంటాయి. ఎవరికైనా.. ఏదైనా.. ఉపాధిని కల్పించాలని భావించినంతనే.. అతన్ని ఏదో ఒక అంశానికి ప్రభుత్వ సలహాదారు అన్న పోస్టును కట్టబెట్టేసి.. ఉత్తర్వులు జారీ చేయటం ఈ మధ్యన అలవాటుగా మారింది.
తాజాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం ఇదే తీరును ఫాలో అవుతున్నట్లుగా కనిపిస్తోంది. ఇందుకు తాజాగా ఆయన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే నిదర్శనం. తెలంగాణ రాష్ట్ర అటవీశాఖ పీసీసీఎఫ్ గా బాధ్యతలు నిర్వర్తించిన ఆర్. శోభ.. సోమవారం పదవీ విరమణ చేశారు.
అయితేనేం.. ఆ వెంటనే ఆమెను అటవీశాఖ వ్యవహారాల పర్యవేక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వానికి సలహాదారుగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు తగ్గ అధికారిక ఉత్తర్వుల్ని జారీ చేశారు.
ఆసక్తికరమైన విషయం ఏమంటే.. అటవీశాఖ పీసీసీఎఫ్ గా వ్యవహరించిన శోభ.. తన రిటైర్మెంట్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. ఆమె వీడ్కోలు సభకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హాజరయ్యారు.
శోభ స్థానంలో రాష్ట్ర పీసీసీఎఫ్ గా రాకేశ్ మోహన్ డోబ్రియల్ నియమితులయ్యారు. ఇంతవరకు బాగానే ఉంది. ఇక్కడే అసలు ట్విస్టుచోటు చేసుకుంది. ఒక సీనియర్ అధికారి రిటైర్ కావటం.. ఆమె వీడ్కోలు సభ పూర్తి అయిన కాసేపటికే..శోభను అటవీశాఖ వ్యవహారాల పర్యవేక్షణ కోసం శోభను ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తూ నిర్ణయం తీసుకోవటం చూస్తే.. రిటైర్ అయిన వారికి ఉపాధిని కల్పించే సలహాదారుల పోస్టును కట్టబెట్టటం ఏపీ సీఎం జగన్ నుంచి తెలంగాణ సీఎం కేసీఆర్ బాగానే అలవాటు చేసుకున్నారనిపించక మానదు.