Begin typing your search above and press return to search.

హైటెక్ బాబు వల్ల కానిది కేసీఆర్ వల్ల అయింది

By:  Tupaki Desk   |   31 March 2016 8:08 AM GMT
హైటెక్ బాబు వల్ల కానిది కేసీఆర్ వల్ల అయింది
X
ఏళ్ల తరబడి కొనసాగిన ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ లక్ష్యాన్ని సాధించిన వ్యక్తిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇప్పటికే రికార్డులకెక్కారు. ఆ తర్వాత కొత్త రాష్ట్రం తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిగానూ బాధ్యతలు చేపట్టిన ఆయన చరిత్ర పుటలకెక్కారు. ఇక తాజాగా దేశంలోని ఏ సీఎం చేయని పనిని కేసీఆర్ చేశారు. చట్టసభల్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూ సరికొత్త రీతిలో ప్రసంగించిన ఆయన రికార్డు నెలకొల్పారు. టెక్ సీఎంగా పేరున్న చంద్రబాబు కూడా ఇంతవరకు ఇలా సభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన దాఖలాలు లేవు. అటు పార్లమెంటులోనే కాక ఇటు దేశంలోని ఏ ఒక్క నేత కూడా చట్టసభలో ఇప్పటిదాకా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వలేదు.

కాగా కేసీఆర్ ఈ కార్యక్రమం కోసం రెండు నెలలుగా కసరత్తు చేశారట. తెలంగాణ జల విధానం రూపకల్పనపై రాత్రింబవళ్లు కష్టపడ్డానని - ప్రాజెక్టుల సమాచారం గూగుల్‌ తోనే సాధ్యమైందని కేసీఆర్ స్వయంగా వెల్లడించారు. ఏ అధికారినీ సంప్రదించకుండా.. అప్పడప్పుడు ఇరిగేషన్ నిపుణులతో చర్చించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ ను రూపొందించినట్లు చెప్పారు. గూగుల్‌ లో ప్రాజెక్టులు అద్భుతంగా ఉన్నాయని, ఎవరైనా చూసుకోవచ్చని సూచించారు. వర్షపు నీరే తప్ప - నది నీళ్లు వచ్చే ఆస్కారం లేకుండా ప్రాజెక్టులు కట్టారని చెప్పారు. సభ్యులకు అర్థమయ్యేందుకు ఈ చిరు ప్రయత్నం చేపట్టానని తెలిపారు. ప్రాజెక్టులను పూర్తి స్థాయిలో కళ్లతో చూస్తే పరిస్థితి ఏంటని అర్థమవుతుందన్నారు. తెలంగాణపై జరిగిన కుట్రలు తెలుసుకుంటే ప్రతి ఒక్కరూ చలించిపోతారని పేర్కొన్నారు.

ఈ క్రమంలో ఆయన తెలంగాణకు గతంలో జరిగిన అన్యాయం, ప్రస్తుతం కొత్త రాష్ట్రంలో తమ ప్రభుత్వం సాధించిన విజయాలను గుదిగుచ్చి కేసీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా దాదాపు రెండు నెలల పాటు అధికారులు శ్రమించి రూపొందించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ను కేసీఆర్ సభలో వినిపించారు.కేసీఆర్ కంప్యూటర్ తెర ముందు కూర్చుని - మౌస్ చేతబట్టి ఆయా అంశాలను సామాన్యుడికి కూడా అర్థమయ్యేలా వివరించారుస్తున్నారు. సాంకేతికంగా తెరపై చూపుతూ తనదైన శైలిలో ఆసక్తికరంగా మాటల్లో వివరిస్తున్నారు. ​