Begin typing your search above and press return to search.
ముందే ప్రకటించి తప్పు చేశామా!!!
By: Tupaki Desk | 1 Nov 2018 6:00 AM GMTతెలంగాణ రాష్ట్ర సమితి ఇరకాటంలో పడుతోందా?. అంతర్గతంగా ఇబ్బందులు పడుతోందా?. ఒక విధంగా చెప్పాలంటే పశ్చాత్తాపం చెందుతొందా..? అవుననే అంటున్నాయి ఆ పార్టీ వర్గాలు. పార్టీ అధినేత - ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఇదే విషయాన్ని పార్టీ సీనియర్ల దగ్గర అన్నట్లు చెబుతున్నారు. ఇంతకీ ఆ విషయం ఏమిటనుకుంటున్నారా. ఏం లేదు... పార్టీ అభ్యర్ధులను ముందుగానే ప్రకటించి వ్యూహాత్మకంగా ప్రతిపక్షాలను దెబ్బ తీసామనుకుంటున్న తెలంగాణ రాష్ట్ర సమితి ఆదే బూమ్ రాంగ్ అయ్యిందని అంటున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి తన ఉద్యమ కాలంలో కాని - అధికారంలోకి వచ్చిన తర్వాత కాని చేయని వ్యూహాత్మక తప్పిదాన్ని ముందస్తు విషయంలో చేశామా అని అంతర్మదనం చెందుతున్నట్లు చెబుతున్నారు. పార్టీ ఏ నిర్ణయాన్ని సీనియర్లు - ముఖ్యులతో చర్చించని అధినేత కె.చంద్రశేఖర రావు ముందస్తు నిర్ణయాన్ని కూడా అలాగే తీసుకున్నారు. ఇంత వరకూ ఆయన తీసుకున్న నిర్ణయం అనుకులంగానే మారింది. అయితే ఇదే దూకుడుతో అభ్యర్ధులను కూడా ప్రకటించడమే వ్యూహాత్మక తప్పిదంగా చెబుతున్నారు. అభ్యర్ధులను కూడా ప్రకటించిన కె.చంద్రశేఖర రావు ప్రతిపక్షాలను పది రోజుల పాటు ఇబ్బందుల పాలు చేశారు. అయితే ఆ తర్వాతే అసలు కథ ప్రారంభమైందంటున్నారు. సిట్టింగులు ప్రచారానికి వెళ్లిన ప్రతిచోటా ప్రజల నుంచి వ్యతిరేకత రావడం ఇబ్బందికరంగా మారింది. ముందు టిక్కట్ ఆశించిన వారి నుంచి వ్యతిరేకత వస్తుందని అధినేత కె.చంద్రశేఖర రావు - పార్టీ ముఖ్యులు ఊహించారు. ఇందుకు అనుగుణంగా వారిని బుజ్జగించేందుకు కూడా అన్ని సిద్ధం చేసుకున్నారు. అయితే కథ ఇక్కడి నుంచే మారిపోయిందంటున్నారు. అసమ్మతుల్లో కొందరు తగ్గినా ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ముందుకు వెళ్లలేక... అభ్యర్ధులను మార్చలేక కేసీఆర్ సతమతమవుతున్నారంటున్నారు.
నిజానికి సిట్టింగుల్లో సగానికి సగం మందిని మార్చాలని పార్టీలో సీనియర్లు అధినేత కె.చంద్రశేఖర రావుకు సూచించారట. అయితే ఇదే నా టీం... దీన్ని ప్రజలు హర్షిస్తారు అని అధినేత మొండికేయడంతో సీనియర్లు కిమ్మనకుండా ఊరుకున్నారు. ఖమ్మం - కరీంనగర్ - నల్లగొండ - మహబూబ్ నగర్ తో పాటు రాజధానిలో కూడా తెలంగాణ రాష్ట్ర సమితి పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారని ప్రగతి భవన్‌కు నివేదికలు వస్తున్నట్లు చెబుతున్నారు. దీంతో పాటు మహాకూటమి కూడా చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూండడం అధికార తెలంగాణ రాష్ట్ర సమితికి మింగుడు పడడం లేదని అంటున్నారు. పొత్తులు కుదరడం లేదనే సాకుతో తాత్సరం చేస్తూ తెలంగాణ రాష్ట్ర సమితిని ఆత్మరక్షణలో పడేస్తున్నారు మహాకూటమి నేతలు. ఇప్పటికే ఉద్రతంగా ప్రచారం జరగాలని ముందుగా నిర్ణయించినా... ప్రత్యర్ధులు ఎవరో తెలియక తెలంగాణ రాష్ట్ర సమితి ఇరుకున పడిందంటున్నారు. తనను చూసి ఓటు వేయాలన్న నినాదం కలిసి వస్తుందనుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావుకు ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకత నిరాశనే మిగిల్చిందంటున్నారు. పరిగెత్తి మొత్తం పాలు అన్ని తాగేయాలని తెలంగాణ రాష్ట్ర సమతి భావించి ఇబ్బందులు పడుతూంటే... నిలబడి నీళ్లు తాగితేనే మంచిదని మహాకూటమి భావిస్తోందని ఓ రాజకీయ విశ్లేషకుడు అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితికి పాలు దొరకవేమోననే భయం వెంటాడుతోందని ఆయన వ్యాఖ్యానించారు.