Begin typing your search above and press return to search.
కేసీఆర్ రెండు పడవల ప్రయాణం
By: Tupaki Desk | 6 Aug 2018 9:09 AM GMTరాజకీయ వ్యూహాలు - వాటిని పటిష్టగా అమలు చేయడంలో దిట్టగా పేరొందిన తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు - ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు వ్యూహాలు ఎవరికి అర్ధం కావు. ఈ రోజు మంచి అనిపించింది... రేపు కాదు... అలాగే నిన్న చెడ్డ అనిపించింది నేడు మంచిగా మారుతుంది. రాజకీయాల్లో ఇది సహజం. అయితే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు వ్యవహరిస్తున్న తీరు మాత్రం ఒకింత ఆశ్యర్యంగానే ఉంటోంది. గడచిన కొన్ని దశాబ్దాలుగా బద్ద వైరులైన భారతీయ జనతా పార్టీ - హైదరాబాద్ లో ఎన్నో ఏళ్లుగా చక్రం తిప్పుతున్న మజ్లిస్ పార్టీలతో ఏక కాలంలో జత కట్టేందుకు కెసిఆర్ రంగం సిద్ధం చేసుకుంటున్నారు.
భారతీయ జనతా పార్టీకి చెందిన కొందరు అగ్ర నాయకులు తెలంగాణ ముఖ్యమంత్రితో సన్నిహితంగా ఉంటున్నారు. ఇది రాష్ట్ర బిజెపీ నాయకులకు మింగుడుపడకపోయినా వారు ఖాతరు చేయడం లేదు. అంతే కాదు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు కేంద్రాన్ని కోరిన వన్నీ క్షణాల్లో కేంద్రం తీర్చేస్తోంది. దీనికి తాజా ఉదాహరణ జోనల్ వ్యవస్ధకు పచ్చ జెండా ఊపడమే. ఈ చర్యతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ... తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ పట్ల ఎంతో సానుకూలంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. టిఆర్ ఎస్ నాయకులు కూడా బిజెపి పట్ల సానుకూలంగా ఉండాలని - ఆచి తూచి మాట్లాడాలని ముఖ్యమంత్రి కెసీఆర్ చెబుతున్నారు. దీనికి ఉదాహరణ ఇటీవలి లోక్ సభ సమావేశాలే.
ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి కేంద్రంలో అధికారాన్ని నిలబెట్టుకోవాలి. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావుకు కావాల్సింది కూడా తెలంగాణలో అధికారాన్ని నిలబెట్టుకోవడమే. రాష్ట్రంలో శత్రుత్వం ఉన్నట్లుగా వ్యవహరిస్తున్న కె.చంద్రశేఖర రావు ఢిల్లీలో మాత్రం గాఢమైన స్నేహితులుగా బిజెపి పెద్దలతో వ్యవహరిస్తున్నారు. లేకపోతే ప్రధాని నరేంద్ర మోదీ ఏకంగా గంట సేపు కె.చంద్రశేఖరరావుతో భేటీ అయ్యారు. ఆయన అడిగినవన్నీ తీర్చే పనిలో పడ్డారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కనీసం కలవని నరేంద్రమోదీ తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ కు ఇంత సమయం కేటాయించడమంటే వారి మైత్రి ఎంత పటిష్టమైందో తెలుస్తోంది.
మరోవైపు హైదరాబాద్ లోనూ - తెలంగాణలోని వరంగల్ - నిజామాబాద్ - కరీంనగర్ జిల్లాల్లో ఎంతో బలంగా ఉన్న మజ్లిస్ పార్టీతో అవగాహన కుదుర్చుకోవాలని కె.చంద్రశేఖరరావు ఎత్తుగడగా తెలుస్తోంది. మజ్లిస్ పార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ తెలంగాణ ప్రభుత్వం - ముఖ్యంగా సిఎం కె.చంద్రశేఖర రావును ఆకాశానికి ఎత్తేసేలా మాట్లాడుతున్నారు. దీని వెనుక మజ్లిస్ పార్టీకి రాజకీయ లబ్దితో పాటు మరికొన్ని లాభాలు కూడా కలగవచ్చు. ఇక తెలంగాణ రాష్ట్ర సమితికి నిజామాబాద్ జిల్లాలో పార్టీకి అంత అనుకూల పరిస్ధితులు లేవు. రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలో చేరతారనే వార్తలు వస్తున్నాయి. దీంతో మజ్లిస్ కు దగ్గరైతే నిజామాబాద్ జిల్లాలో పార్టీకి ఇబ్బందులుండవన్నది కెసీఆర్ వ్యూహం. ఇలా రెండు పడవలపై కాలు పెట్టడం వల్ల ఎలాంటి ఇబ్బందులొస్తాయో కెసీఆర్ ముందుగానే ఓ అవగాహనకు వచ్చారని, పెద్దగా ఇబ్బందులు ఉండవని నిర్ణయించుకున్న తర్వాతే ఇలా చేస్తున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.