Begin typing your search above and press return to search.

కరోనా 'మహా' కల్లోలం..కేసీఆర్ సూచనతోనే కట్టడి

By:  Tupaki Desk   |   7 April 2020 5:53 PM GMT
కరోనా మహా కల్లోలం..కేసీఆర్ సూచనతోనే కట్టడి
X
ప్రాణాంతక వైరస్ గా పరిణమించిన కరోనా...మహారాష్ట్రంలో పెను కలకలమే రేపుతోంది. దేశంలోని దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో కరోనా కొత్త కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతుండగా... మహారాష్ట్రలో మంగళవారం ఒక్కరోజే ఏకంగా వంద కొత్త కేసులు నమోదు కావడం నిజంగానే భయాందోళనలకు గురి చేసేదేనని చెప్పాలి. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమల్లో ఉండగానే పరిస్థితి ఇలా ఉంటే... మరి ఈ నెల 14తో లాక్ డౌన్ ను ముగియనుందన్న వార్తల నేపథ్యంలో మహారాష్ట్రలో కొత్తగా నమోదైన కేసులను చూస్తుంటే... కరోనాను కట్టడి చేసేందుకు మరింత సమయం లాక్ డౌన్ ను పొడిగిస్తేనే మంచిదన్న వాదన వినిపిస్తోంది. అదేంటో గానీ... కరోనా కట్టడిలో అన్ని రాష్ట్రాల కంటే ముందున్న తెలంగాణ.. మున్ముందు జరగబోయే విపరిణామాలను కూడా పసిగట్టేస్తోందని చెప్పక తప్పదు. ఇందుకు నిదర్శనమనే.. సోమవారం నాడు కేసీఆర్ నిర్వహించిన మీడియా సమావేశమని చెప్పాలి. కరోనాను పూర్తిగా కట్టడి చేయాలంటే... లాక్ డౌన్ ను మరింత కాలం పాటు పొడిగించాల్సిందేనని చెప్పిన కేసీఆర్... ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం మరింత లోతుగా దృష్టి సారించాలని కూడా చెప్పుకొచ్చారు.

ఇక మహారాష్ట్రంలో కరోనా కలకలం విషయానికి వస్తే... ఆ రాష్ట్రంలో కరోనా విస్తరణ ఆదిలో కాస్తంత నిదానంగానే కనిపించినా... తాజాగా అక్కడ కొత్త కేసులు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్నాయి. మంగళవారం ఒక్క రోజే మహారాష్ట్రలో కొత్తగా వంద కేసులు నమోదు కావడం... ఆ రాష్ట్ర రాజధాని ముంబైలోని మురికివాడ ధారవిలో కూడా కొత్తగా కేసులు నమోదు కావడం చూస్తుంటే... ఆ రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ కరోనా కొత్త కేసులు నమోదు తప్పనట్టేనన్న వాదన వినిపిస్తోంది. ఇలాంటి నేపథ్యంలో కరోనా కట్టడి కోసం కేంద్రంతో పాటు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్బంధ చర్యలను మరింత కాలం పాటు కొనసాగించాల్సిందేనన్న వాదనలకు అంతకంతకూ బలం పెరుగుతోంది. అంటే... కరోనా విస్తరణ మొత్తంగా తగ్గినట్టుగా కనిపిస్తున్నా కూడా మున్ముందు ఆ వైరస్ ప్రభావం ఇంకా కొనసాగే అవకాశాలు ఉన్నాయని చెప్పక తప్పదు.

ఈ తరహా పరిస్థితిని ముందే ఊహించడంలో తెలంగాణ సీఎం కేసీఆర్ అందరి కంటే ముందున్నారన్న వాదన కూడా ఆసక్తి రేపుతోంది. కరోనా కట్టడి చర్యల్లో దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే కూడా తెలంగాణను నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టిన కేసీఆర్... తెలంగాణలో తాను అమలు చేస్తున్న చర్యలు మిగిలిన రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకునేలా వ్యవహరించారు. తాజాగా సోమవారం నాటి మీడియా సమావేశంలో భాగంగా కరోనా కట్టడి కోసం తీసుకోవాల్సిన చర్యల విషయంలో కేసీఆర్ ముందు చూపు స్పష్టంగానే కనిపిస్తోందని చెప్పాలి. ధారవిలో మంగళవారం నమోదైన కొత్త కేసుల నేపథ్యంలో... కేసీఆర్ సూచించినట్టుగా లాక్ డౌన్ ను మరింత కాలం పొడిగించేలా కేంద్రం చర్యలు తీసుకోవాల్సిందేనన్న దిశగా ఆసక్తికర వాదనలు వినిపిస్తున్నాయి. మొత్తంగా తొలుత కరోనా కట్టడిలో దేశానికే ఆదర్శంగా నిలిచిన కేసీఆర్... కరోనా తన విస్తరణనను విరమిస్తున్న నేపథ్యంలోనూ తన సూచనలు విలువైనవేనన్న దిశగా వ్యవహరిస్తున్నారని చెప్పక తప్పదు.