Begin typing your search above and press return to search.
షర్మిలకు జలక్.. భద్రత తీసేసిన కేసీఆర్ సర్కార్!
By: Tupaki Desk | 28 April 2021 3:36 AM GMTవైఎస్ షర్మిల వెనుక కేసీఆర్ ఉన్నారని ఇన్నాళ్లు ప్రతిపక్షాలు అనుమానించాయి.. ఆరోపించాయి. కానీ ఆమె మాత్రం తెలంగాణలో కేసీఆర్ నే టార్గెట్ చేసింది. టీఆర్ఎస్ సర్కార్ ఉద్యోగాలు ఇవ్వడం లేదని ఖమ్మం సభ నుంచి ఇందిరాపార్క్ వద్ద దీక్ష వరకు ఎలుగెత్తి చాటింది.
తన మెయిన్ టార్గెట్ కేసీఆర్ అని తెలిసాక ఆ ప్రభుత్వం ఊరుకుంటుందా? షర్మిలను దీక్ష సమయంలోనే అరెస్ట్ చేసింది. దానికి షర్మిల గట్టిగానే రియాక్ట్ అయ్యింది.
సున్నితమైన ఉద్యోగాలు.. నిరుద్యోగుల సమస్యను వైఎస్ షర్మిల లేవనెత్తుతుండడంతో కేసీఆర్ సర్కార్ అలెర్ట్ అయ్యింది. ఇక షర్మిలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఊపేక్షించవద్దని డిసైడ్ అయ్యింది.
ఈ క్రమంలోనే వైఎస్ షర్మిల భద్రతను తెలంగాణ ప్రభుత్వం ఉపసంహరించుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. షర్మిలపై కేసీఆర్ సర్కార్ నజర్ పెట్టారని దీన్ని బట్టి పలువురు అనుమానిస్తున్నారు.
15 రోజుల క్రితం షర్మిలకు తెలంగాణ ప్రభుత్వం 2+2 గన్ మెన్లను ప్రభుత్వం కేటాయించింది. అయితే నిరుద్యోగులకు మద్దతుగా ఉద్యోగాల భర్తీ అంటే కేసీఆర్ ను ఇరుకునపెట్టేలా షర్మిల దీక్ష చేసింది. దీక్ష సమయంలో కేసీఆర్ పై సీరియస్ ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలోనే షర్మిలకు కేటాయించిన భద్రతను వెనక్కి తీసుకోవడం ఇప్పుడు రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది.