Begin typing your search above and press return to search.
హైదరాబాద్ వాసులకు షాకిచ్చిన సీఎం కేసీఆర్
By: Tupaki Desk | 19 May 2020 3:45 AM GMTతెలంగాణ లో లాక్‌డౌన్ ను ఈ నెలాఖరు వరకు పొడిగిస్తూనే రాష్ట్రంలో చాలా వాటికి మినహాయింపులు ఇచ్చారు. ఒక్క హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాలు మినహా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో బస్సులు, దుకాణాలు, అన్ని వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించుకోవచ్చని ప్రకటించారు. అయితే హైదరాబాద్‌వాసులకు మాత్రం కేసీఆర్ షాకిచ్చారు. హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
తెలంగాణలోని కంటైన్మెంట్ జోన్లు మినహా మిగతా అన్నింటిని గ్రీన్ జోన్లుగా ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా సాధారణ పరిస్థితి ఏర్పడుతుందని చెబుతూనే హైదరాబాద్ విషయంలో మాత్రం ఆంక్షలు విధించారు. రాష్ట్రంలో అన్ని షాపులు, వ్యాపారాలు ప్రారంభించుకోవచ్చని తెలిపారు. కానీ హైదరాబాద్ లో ప్రత్యామ్నాయ పద్ధతుల్లో దుకాణాలు తెరుచుకోవచ్చని వివరించారు. సెలూన్లు కూడా తెరుచుకోవచ్చని చెప్పారు. ప్రజా రవాణా (ఆర్టీసీ) హైదరాబాద్ మినహా రాష్ట్రంలో అన్ని బస్సులు నడుస్తాయని పేర్కొన్నారు. సినిమా హాల్, ఫంక్షన్ హాల్‌లకు అనుమతి లేదు అని స్పష్టం చేశారు. టాక్సీలు, కారుల్లో 1+3 చొప్పున అనుమతి ఉందని, ఈ-కామర్స్‌లో అన్ని రకాల సర్వీసులు అందుబాటులో ఉంటాయని తెలిపారు.
ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు పెద్ద సంఖ్యలో ఉండడంతో అవన్నీ తమ కార్యకలాపాలు కొనసాగించుకోవచ్చని, కాకపోతే లాక్‌డౌన్, కోవిడ్ నిబంధనలకు లోబడి చేసుకోవచ్చని సీఎం కేసీఆర్ తెలిపారు. అన్ని రకాల ప్రార్థన మందిరాలు, ఉత్సవాలు బంద్ ఉంటాయని, సభలు, ర్యాలీలు, సమావేశాలు విద్యా సంస్థలు బంద్ చేయాల్సిందని మరోసారి స్పష్టం చేశారు. బయటకు వచ్చే ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, లేకపోతే రూ.వెయ్యి జరిమాన తప్పదని హెచ్చరించారు. వ్యక్తిగత శానిటైజేశన్ పాటించాలని సూచించారు. అందరికీ చేతులెత్తి మొక్కుతున్న...స్వీయ నిర్బంధం పాటించి కరోనా రాకుండా కాపాడుకుందామని ప్రజలందరికీ ముఖ్యమంత్రి కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.