Begin typing your search above and press return to search.
జెండాలు..టోపీలు రెఢీ అయ్యాయి..తీసుకెళ్లండి!
By: Tupaki Desk | 25 Aug 2018 8:30 AM GMTతెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్లానింగ్ ఎలా ఉంటుందన్న దానికి తాజాగా చోటు చేసుకున్న ఒక ఉదంతం మరోసారి స్పష్టం చేస్తుందని చెప్పాలి. ముందస్తుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న ఆయన.. ఆ విషయాన్ని ఓపెన్ గా చెప్పనప్పటికీ.. ఆ దిశగా ఆయన మాటలు సాగాయని చెప్పాలి.
సెప్టెంబరు 2న హైదరాబాద్ శివారులోని కొంగర వద్ద ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లు ఎంత పక్కాగా ఉండనున్నాయన్న విషయాన్ని తాజాగా మరోసారి రుజువు చేశారు. వచ్చే నెల 2న జరిగే బహిరంగ సభకు అవసరమైన ప్రచార సామాగ్రిని సిద్ధం చేసిన వైనం ఎంపీలకు.. ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలకు ఆశ్చర్యానికి గురి చేసింది. సభకు దాదాపు పది రోజుల ముందే ఏర్పాట్లు ఇంత పక్కాగా ఉండటమా? అన్న ఆశ్చర్యం వ్యక్తమైంది.
సమావేశానికి వచ్చిన వారికి జెండాలు.. టోపీలు సిద్ధంగా ఉన్నాయని.. నేతలకు కేటాయించిన పెట్టెల్ని తమతో తీసుకెళ్లాలని చెప్పటమే కాదు.. సమావేశం అయ్యాక వారికి భారీ ఎత్తున ప్రచార సామాగ్రిని అప్పజెప్పారు.
ప్రతి ఎమ్మెల్యేకు ఐదు వేల జెండాలు.. యాభైవేల టోపీల్ని అందజేసినట్లుగా తెలుస్తోంది. కేవలం పది రోజుల ముందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బహిరంగ సభ గురించి చెప్పటం.. ఆ తర్వాత డేట్ ఫిక్స్ చేయటం ఒక ఎత్తు అయితే.. మరోవైపు.. సభకు భారీగా అవసరమైన ప్రచార సామాగ్రిని పెట్టెల రూపంలో సిద్ధంగా ఉండచటమే కాదు.. ఎవరికి ఎంత మెటీరియల్ ఇవ్వాలన్న లెక్కను పక్కాగా వేసి ఉండటం చూస్తే.. కేసీఆర్ ఎంత ముందు ఆలోచనలో ఉన్నారో ఇట్టే తెలిసిపోతుందన్న మాట వినిపిస్తోంది. అధినేత ముందుచూపు గులాబీ నేతలకు స్వీట్ షాకివ్వటమే కాదు.. పక్కా ప్లానింగ్ అంటే ఇదేనన్న కితాబులు ఇవ్వటం వినిపించింది.