Begin typing your search above and press return to search.

కేసీఆర్ కు బీసీలు ఫిదా అయిపోవాల్సిందే

By:  Tupaki Desk   |   20 Oct 2015 4:13 AM GMT
కేసీఆర్ కు బీసీలు ఫిదా అయిపోవాల్సిందే
X
సాహసోపేతమైన నిర్ణయాల్ని అలవోకగా తీసుకోవాలంటే తెలంగాణ రాష్ట్ర సర్కారుకే సాధ్యమన్న విషయం మరోసారి నిరూపితమైంది. సంక్షేమ కార్యక్రమాలకు సబంధించి అధికారిక నిర్ణయాలు తీసుకునే విషయంలో కొంచెం స్పీడు తగ్గించిన తెలంగాణ సర్కారు.. తాజాగా తీసుకున్న నిర్ణయం రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది.

వివిధ సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి వెనుకబడిన వర్గాల (బీసీ) కు వర్తింపచేసే ఆదాయానికి సంబంధించి తెలంగాణ సర్కారు పరిమితి పెంచింది. ఇప్పటివరకూ ఉన్న పరిమితిని భారీగా పెంచుతూ తెలంగాణ సర్కారు నిర్ణయం తీసుకుంది. దీంతో.. బీసీల పట్ల కేసీఆర్ సర్కారు ఎంత సానుకూలంగా ఉందన్న విషయాన్ని తాజా నిర్ణయంతో చెప్పకనే చెప్పినట్లైంది.

పోమవారం విడుదల చేసిన అధికారిక ఉత్తర్వులు చూస్తే.. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారు సంక్షేమం.. బోధనం.. ఉపకార ప్రయోజనాలు పొందాలంటే బీసీల ఆదాయం ఏడాదికి రూ.60వేలు మాత్రమే ఉండాల్సి ఉంది. అయితే.. తాజాగా ఆ పరిమితిని రూ.1.50లక్షలకు పెంచారు. అదే సమయంలో నగరాల్లో నివసించే బీసీలకు ప్రస్తుతం ఉన్న రూ.75 వేల నుంచి రూ.2లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంటారు.

దీంతో.. గ్రామాల్లో ఉన్న నెలకు రూ.5వేల నుంచి రూ.12,500లకు పెరిగినట్లైంది. ఇక.. నగరాల్లో నివసించే వారి ఆదాయ పరిమితి నెలకు రూ.16వేలకు పైనే ఆదాయం ఉన్న వారు కూడా అర్హులంటూ తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తమవుతోంది. తాజాగా తీసుకున్న నిర్ణయంతో బీసీలకు చెందిన వారు పెద్దఎత్తున ప్రయోజనం చెందే అవకాశం ఉంది. తాజా నిర్ణయంతో పదో తరగతికి ముందు.. పదో తరగతి తర్వాత వివిద సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి బీసీలకు లబ్థి చేకూరే వీలుంది.