Begin typing your search above and press return to search.
ఆ నలుగురికి కేసీఆర్ `బహుమతి`
By: Tupaki Desk | 3 Aug 2016 7:51 AM GMT`ఒకేదెబ్బకి రెండు పిట్టలు` అనే మాటను తెలంగాణ సీఎం కేసీఆర్ నిజం చేయబోతున్నారా? తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన `హరితహారం`లో బాగా పనిచేసిన నేతలకు `బహుమతి` ఇవ్వబోతున్నారా? నేతలంతా ఎంతోకాలంనుంచీ ఎదురుచూస్తున్న.. నామినేటెడ్ పదవుల భర్తీకి హరితహారం పనితీరు గీటురాయిగా మారబోతోందా? ముఖ్యంగా నలుగురు ఎమ్మెల్యేలకు ఈ పదవులు దక్కబోతున్నాయా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది.
`బంగారు` తెలంగాణను `హరిత` తెలంగాణగా మార్చాలని సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం.. కొంతమంది నేతలకు అద్భుత బహుమతి అందించబోతోందట. సీఎంవో ప్రోగ్రస్ రిపోర్ట్ లో `ఏ` గ్రేడ్ సాధించిన ఎమ్మెల్యేల పంట డబోతోంది. నేరుగా కేసీఆర్ ఈ పథకాన్ని సమీక్షిస్తుండటంతో నేతలంతా కష్టపడుతున్నారు. మూడు వారాల నుంచి జోరుగా సాగుతున్న హరితహారంలో సర్పంచ్ లు మొదలుకొని మంత్రుల వరకు అందరూ ఉత్సాహంగా పాల్గొంటున్నారు. వేలు - లక్షలు - కోట్లాదిగా మొక్కలు నాటుతున్నారు. సీఎంవో అధికారులు కూడా రోజువారీ ప్రోగ్రెస్ రిపోర్టులు తయారు చేసి కేసీఆర్ టేబుల్ మీద ఉంచుతున్నారు. అధికారుల రిపోర్టులతో హరితహారంలో ఎవరి భాగస్వామ్యం ఎంత, ఎవరి పనితీరు ఎలాఉంది అనే అంశంపై కేసీఆర్ ఓ క్లారిటీకి వచ్చారట.
ఇందులో బాగా పనిచేసిన ఓ నలుగురు ఎమ్మెల్యేలకు నామినేటెడ్ పదవులు ఇచ్చేందుకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. వారి పేర్లు ఒకటిరెండు రోజుల్లో ప్రకటిస్తారంటూ పార్టీ శ్రేణులు చెవులు కొరుక్కుంటున్నాయి. ఎమ్మెల్యేలతోపాటు నామినేటెడ్ పదవుల కోసం ఎదురు చూస్తున్న మరికొందరు సీనియర్లకు కూడా హరితహారం వరం కాబోతున్నదట. వారికీ పెద్దపెద్ద కార్పొరేషన్ పదవులే లభించబోతున్నాయట. ఇందులో కేసీఆర్ ప్లాన్ వేరే ఉందట. అదేంటంటే.. ఈ రకమైన గిఫ్ట్‌లు ఇస్తే వారిలో ఉత్సాహం పెరుగుతుందనీ, ఇంకా కష్టపడి పనిచేస్తారనీ కేసీఆర్ భావిస్తున్నారట. అందుకే హరితహారంలో మంచి పేరు తెచ్చుకున్న వారికి పదవులు ఇస్తే.. అటు నామినేటెడ్ పదవులు ఇచ్చినట్లూ అవుతుందన్నదే కేసీఆర్ ప్లాన్ గా తెలుస్తోంది.