Begin typing your search above and press return to search.

వాసాలమర్రిపై కేసీఆర్ వరాలు.. అందరికీ ఇళ్లు

By:  Tupaki Desk   |   4 Aug 2021 4:30 PM GMT
వాసాలమర్రిపై కేసీఆర్ వరాలు.. అందరికీ ఇళ్లు
X
తెలంగాణ సీఎం కేసీఆర్ తన దత్తత గ్రామంలో పర్యటించారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని వాసాలమర్రిలో పర్యటించారు. ఈరోజు వాసాలమర్రిలో పర్యటించిన కేసీఆర్ దళితవాడలో అధికారులతో కలిసి ఇంటింటికి తిరుగుతూ పరిశీలించారు. వార్డుల్లో మౌళిక సదుపాయాల కల్పనతోపాటు దళితుల స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు.

దళితవాడలో పర్యటన ముగిసిన అనంతరం గ్రామమంతా కలియతిరుగుతూ పారిశుధ్య చర్యలను పరిశీలించారు. అనంతరం రైతు వేదిక భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో గ్రామాభివృద్ధిపై స్థానికులతో చర్చించనున్నారు. గత నెలలో వాసాలమర్రి పర్యటన సందర్భంగా తాను ఇచ్చిన హామీల అమలుతీరుపై కేసీఆర్ అధికారులతో సమీక్షించనున్నారు. తదుపరి చేపట్టాల్సిన కార్యాచరణపై ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలకు సీఎం కేసీఆర్ దిశానిర్ధేశం చేస్తారు.

వాసాలమర్రి గ్రామానికి సీఎం కేసీఆర్ రావడం ఇది రెండోసారి.. కాగా గత జూన్ 22న తొలిసారిగా వాసాలమర్రికి వచ్చిన ముఖ్యమంత్రి గ్రామస్థులతో కలిసి గ్రామాభివృద్ధిపై చర్చించి అనంతరం సహపంక్తి భోజనం చేశారు. 42 రోజుల తర్వాత సీఎం మరోసారి గ్రామానికి వచ్చారు.

అయితే సీఎం కేసీఆర్ తో సమావేశానికి కేవలం దళితులను మాత్రమే అనుమతించడంపై పలువురు గ్రామస్థులు అభ్యంతరం తెలిపారు. దళితులు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులతో పాటు గ్రామంలోని 150మందికి అనుమతి మొదట అధికారులు చెప్పారని.. కానీ ఇప్పుడు సమావేశానికి వెళ్లకుండా అడ్డుకుంటున్నారని గ్రామస్థులు వాపోతున్నారు.

ఇక వాసాల మర్రి గ్రామంపై సీఎం కేసీఆర్ మరోసారి వరాల జల్లు కురిపించారు. డబుల్ బెడ్ రూం ఇల్లు, దళితబంధుతోపాటు నిరుద్యోగులకు లోన్లు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు.