Begin typing your search above and press return to search.

స్టీఫెన్ సన్ త్యాగానికి కేసీఆర్ గుర్తింపు

By:  Tupaki Desk   |   7 Jan 2019 11:05 AM GMT
స్టీఫెన్ సన్ త్యాగానికి కేసీఆర్ గుర్తింపు
X
ఓటుకు నోటు కేసు.. టీడీపీ తెలంగాణలో అంతర్థానం కావడానికి.. చంద్రబాబు అమరావతికి పారిపోవడానికి కారణమైంది. ఈ పెద్ద కుట్రకు అసలు సూత్రధారి ఎవరైనా.. పట్టించిన క్రెడిట్ మాత్రం నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ కే దక్కుతుంది. అందుకే రెండోసారి సీఎం కేసీఆర్ గద్దెనెక్కగానే మొదట ఆంగ్లో ఇండియన్ కోటాలో స్టీఫెన్ సన్ కు ఎమ్మెల్యే పదవి ఇవ్వాల్సిందిగా గవర్నర్ కు సిఫారసు చేశారు.

స్టీఫెన్ సన్... చంద్రబాబు-రేవంత్ రెడ్డి డబ్బులకు అమ్ముడు పోకుండా కేసీఆర్ కు వాళ్ల బాగోతం చెప్పి వారిని పట్టించేలా చేయడంలో ఎంతో నీతి నిజాయితీలతో వ్యవహరించారు. టీడీపీని ఇరకాటంలో పెట్టడంలో టీఆర్ ఎస్ ప్రయత్నాలకు సహకరించారు. ఆ తర్వాత బాబు, రేవంత్ ఓటుకు నోటులో స్టీఫెన్ సన్ కూడా కోర్టుల చుట్టు తిరుగుతున్నారు. దీంతో ఆయన చేసిన సాయానికి గుర్తుగా నామినేటెడ్ ఎమ్మెల్యే పదవిని కట్టబెట్టేందుకు కేసీఆర్ రెడీ అయ్యారు.

తెలంగాణ అసెంబ్లీలో మొత్తం 120 సీట్లలో 119 మంది ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఎన్నికైతే.. ఒకరు మాత్రం ఆంగ్లో ఇండియన్ ను నామినేట్ చేస్తారు. సీఎం కేసీఆర్ తాజాగా తొలి కేబినెట్ భేటిలోనే స్టీఫెన్ సన్ ను నామినేట్ చేస్తూ గవర్నర్ ఆమోదం కోసం పంపారు. ఎమ్మెల్యేలతో పాటే నామినేటెడ్ ఎమ్మెల్యేగా స్టీఫెన్ సన్ ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు సమాచారం.