Begin typing your search above and press return to search.
నేనే రాజు.. వాడే మంత్రి
By: Tupaki Desk | 25 Oct 2018 3:30 PM GMTఇదేదో సినిమా అనుకుంటున్నారా. కానే కాదు. తెలంగాణ రాష్ట్ర సమితి ముందస్తు ఎన్నికల కొత్త నినాదం. అదేంటీ తెలంగాణ రాష్ట్ర సమితి అద్యక్షుడు కె.చంద్రశేఖర రావే కదా ముఖ్యమంత్రి మళ్లీ ఇదంతా ఏమిటీ అనుకుంటున్నారా. అవునే ఇది నిజమే. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రిగా తానే ఉంటానని - తన కుమారుడు కల్వకుంట్ల తారక రామారావు కేవలం మంత్రిగానే ఉంటారని ప్రచారం చేయాల్సిందిగా సాక్షాత్తూ ఆ పార్టీ అధ్యక్షుడు - ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావే ప్రచారం చేయాలని ఆదేశించినట్లు చెబుతున్నారు. కాంగ్రెస్ - భారతీయ జనతా పార్టీలకు ప్రత్యామ్నాయంగా తాను తీసుకురావాలనుకుంటున్న మూడో ఫ్రంట్ అధికారంలోకి రావడం...తాను జాతీయ రాజకీయాల్లోకి వెళ్తానని ప్రచారం చేయడం కె.చంద్రశేఖర రావుకు మొదటికే మోసం తీసుకువచ్చిందంటున్నారు. తాను ఒకటి తలిస్తే తెలంగాణ ప్రజలు మరొకటి తలచినట్లుగా అయ్యిందని కల్వకుంట్ల చంద్రశేఖర రావు తన సన్నిహితుల వద్ద అన్నట్లు చెబుతున్నారు. తాను జాతీయ రాజకీయాల వైపు వెళ్తే తన కుమారుడ్ని ఇక్కడ ముఖ్యమంత్రి చేస్తారని తెలంగాణ వ్యాప్తంగా ప్రచారం జరిగింది. ప్రతిపక్షాలైతే తన కుమారుడ్ని ముఖ్యమంత్రిని చేసేందుకే ముందస్తుకు వెళ్తున్నారని ఆరోపించాయి కూడా. ఇది కాస్తా శ్రతి మించి రాగాన పడిందంటున్నారు. తన కుమారుడు కె.తారక రామారావు పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉందని, ఆయన దుందుడుకు స్వభావంతో పార్టీలో కూడా ఇబ్బందులు తప్పవని ఇంటెలిజెన్సీ నివేదికలు వచ్చాయంటున్నారు.
ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ తన కుమారుడు ముఖ్యమంత్రి అవుతారనే ప్రచారం కారణంగా ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగులుతుందని గ్రహించిన కె.చంద్రశేఖర రావు తానే ముఖ్యమంత్రి అంటూ తెలంగాణలో ప్రచారం చేయాలని పార్టీ వారికి ఆదేశించినట్లు చెబుతున్నారు. ఈ ప్రచారమే తమ ప్రధాన అస్త్రం కావాలని - తన కుమారుడు తారక రామారావు మంత్రి మాత్రమేనని పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని ఆదేశించినట్లు చెబుతున్నారు. అలాగే తాను జాతీయ రాజకీయాలను ఇక్కడి నుంచే శాసిస్తానని - చంద్రబాబు నాయుడు చెప్పినట్లుగా తనకు రాష్ట్రమే ముఖ్యమనే అభిప్రాయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని కూడా ఆయన ఆదేశించినట్లు చెబుతున్నారు. దీనికి అనుసరించే బుధవారం నాడు జగిత్యాలలో జరిగిన సభలోనూ - ముఖ్య కార్యకర్తల సమావేశంలోనూ కూడా కేసీఆర్ తనయుడు కె.తారక రామారావు తన తండ్రే ముఖ్యమంత్రి అని ప్రకటించారని కూడా చెబుతున్నారు. ప్రజల్లో నాటుకున్న అభిప్రాయాలను తుడిచి వేయాలని - ఉద్యమం చేసింది తానే కనుక వారికి తనపైనే ఎక్కువ నమ్మకమని కూడా ఈ సందర్భంగా కె.చంద్రశేఖర రావు పార్టీ శ్రేణులతో అన్నట్లు చెబుతున్నారు. ఎన్నికల చివరి వరకూ తానే రాజు.... కొడుకే మంత్రే అనే ప్రచారాన్ని విరివిగా చేయాలని అన్నట్లు చెబుతున్నారు.