Begin typing your search above and press return to search.

రేవంత్‌ కు మ‌ళ్లీ షాకిచ్చిన కేసీఆర్‌

By:  Tupaki Desk   |   22 Dec 2018 4:23 PM GMT
రేవంత్‌ కు మ‌ళ్లీ షాకిచ్చిన కేసీఆర్‌
X
తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి విష‌యంలో గులాబీ ద‌ళ‌ప‌తి కేసీఆర్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. రేవంత్ రెడ్డి అరెస్ట్ వ్యవహారంలో ఎన్నికల కమిషన్ అధికారుల ఆదేశాలతో వికారాబాద్ ఎస్పీ అన్నపూర్ణపై వేటు వేసిన సంగతి తెలిసిందే. డీజీపీ హెడ్‌క్వార్టర్‌ కు అటాచ్ చేశారు. అన్నపూర్ణ స్థానంలో అవినాష్ మహంతిని నియమించారు. అయితే, తాజాగా వికారాబాద్ ఎస్పీగా మళ్లీ అన్నపూర్ణకే పోస్టింగ్ ఇచ్చింది.

ఈ డిసెంబర్ 3వ తేదీ తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయడం కొడంగల్ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపింది. టీఆర్ ఎస్ అధినేత‌ కేసీఆర్ సభను అడ్డుకుంటామనీ..కోస్గిలో సభను జరగనివ్వబోమని రేవంత్ రెడ్డి హెచ్చరించిన నేపథ్యంలో - ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఆయన్ను అరెస్ట్ చేయాల్సి వచ్చిందని పోలీసు అధికారులు స్పష్టం చేశారు.అయితే, వికారాబాద్ ఎస్పీ అన్నపూర్ణ ఈ వివాదానికి కార‌ణ‌మ‌ని పేర్కొంటూ ఎన్నిక‌ల క‌మిష‌న్ ఆమెను డీజీపీ కార్యాల‌యానికి అటాచ్ చేసింది.ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచిన టీఆర్ ఎస్ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఎన్నికల్లో దూకుడుగా వ్యవహరించి బదిలీవేటుకు గురైన అన్న‌పూర్ణ‌ను తిరిగి వికారాబాద్ ఎస్పీగానే నియమిస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది. ఈసీ ఆదేశాల ప్రకారం అప్పుడు అన్నపూర్ణపై బదిలీవేటు వేసినప్పటికీ.. ప్రభుత్వం కొలువుదీరగానే మరోసారి ఆమెను వికారాబాద్ ఎస్పీగా నియమించడం విశేషం.