Begin typing your search above and press return to search.

కేసీఆర్ కు జలక్ ఇస్తే ఇలాగే ఉంటది..

By:  Tupaki Desk   |   11 May 2019 5:30 PM GMT
కేసీఆర్ కు జలక్ ఇస్తే ఇలాగే ఉంటది..
X
తెలంగాణ రాష్ట్ర సమితి మహిళా విభాగం అధ్యక్షురాలు ఆమె.. పోయిన డిసెంబర్ ఎన్నికల్లో టీఆర్ ఎస్ టికెట్ కావాలని చాలా ప్రయత్నించారు. కేసీఆర్ కు ప్రతిసారి రాఖీ కట్టి చెల్లెమ్మగా టీఆర్ ఎస్ లో పేరొందిన తుల ఉమ కు ఈసారి ఎమ్మెల్యే టికెట్ ను కేసీఆర్ కేటాయించలేదు. పోనీలా అని పార్టీ కోసం కష్టపడితే ఆమె కు మరోసారి జడ్పీ చైర్మన్ కానీ, ఎమ్మెల్సీ కానీ దక్కి ఉండేది. కానీ ఆమె చేసిన పనే ఇప్పుడు ఆమెకు ఏ పదవి దక్కకుండా చేసిందని టీఆర్ ఎస్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

మొన్నటి అసెంబ్లీ ఎన్నికల వేళ.. కరీంనగర్ పూర్వపు జిల్లాలోని వేములవాడ అసెంబ్లీ స్థానాన్ని తుల ఉమ ఆశించారు. చివరి వరకు ప్రయత్నించారు. కానీ కేసీఆర్ అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన చెన్నమనేని రమేష్ బాబుకే కేటాయించారు. ఆయన జర్మనీ పౌరసత్వం వివాదంలో ఉండడం... స్థానికంగా ఉండక జర్మనీలోనే ఉంటారన్న అపవాదు ఉంది. అందుకే ఆయనకు కాకుండా తనకు టికెట్ ఇవ్వాలని తుల ఉమా చాలా లాబీయింగ్ చేసినా కేసీఆర్ నో చెప్పారు.

అంతటితో ఊరుకోకుండా తుల ఉమ వేములవాడ నియోజకవర్గంలో సిట్టింగ్ టీఆర్ ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన చెన్నమనేనికి వ్యతిరేకంగా లాబీయింగ్ చేశారు. తన సామాజికవర్గం నేతలతో గ్రూపులు కట్టి ప్రచారం చేయించారు. రమేష్ బాబును ఓడిస్తామని ప్రతి మండలంలో సభలు, సమావేశాలు నిర్వహించారు. దీనిపై కేసీఆర్ కు కూడా రమేష్ బాబు ఫిర్యాదు చేశారు..

అది మనసులో పెట్టుకున్న కేసీఆర్ తాజా పరిషత్ ఎన్నికల వేళ ఆమెకు జడ్పీ చైర్మన్ పదవి ఇవ్వకుండా అందుకోసం జడ్పీటీసీ టికెట్ కూడా ఇవ్వకుండా పక్కనపెట్టేశారు. కనీసం ఎమ్మెల్సీ ఇస్తారని అనుకున్నా అదీ ఇవ్వడం లేదట.. ఇలా కేసీఆర్ కు ఎదురెళ్లిన టీఆర్ ఎస్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పరిస్థితి ఎప్పుడూ ఎటూ కాకుండా పోయిందని ఆ పార్టీలో చర్చించుకుంటున్నారు.