Begin typing your search above and press return to search.
సుడి అంటే సారుదే.. స్పెషల్ ఫ్లైట్ షాక్ అస్సలు తగలదే?
By: Tupaki Desk | 3 Oct 2019 4:28 AM GMTఒకేలాంటి పనులు ఇద్దరు రాజకీయ అధినేతలు చేస్తే.. ఒకరేమో తీవ్రమైన విమర్శలు పాలైతే.. మరొకరు మాత్రం విమర్శలు దగ్గరకు వెళ్లేందుకు సైతం జడిచే పరిస్థితి చూస్తే ఆశ్చర్యం కలుగక మానదు. విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో తన ఐదేళ్ల పాలనతో టీడీపీ అధినేత చంద్రబాబు ఎంతగా భ్రష్టుపట్టారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం ఉండదు. ఆర్థికంగా చితికిపోయిన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటూ ఎక్కడకు వెళ్లినా ప్రత్యేక విమానాల్లో వెళ్లే వైనంపై పెద్ద ఎత్తున విమర్శల పాలు కావటం తెలిసిందే.
ప్రత్యేక విమానాల్లో ప్రయాణించే అలవాటు చంద్రబాబుకే కాదు.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఉంది. కానీ.. ఆ విషయం పెద్దగా ఫోకస్ కాదు. విభజనతో ఆంధ్రప్రదేశ్ అప్పుల ఊబిలో దిగిపోతే.. తెలంగాణలో మాత్రం సారు విజన్ కారణంగా భారీ అప్పులు మీద పడిపోయిన పరిస్థితి. మొత్తంగా.. రెండు తెలుగు రాష్ట్రాలకు అప్పులు తిప్పలు తప్పని పరిస్థితి. ఇలాంటివేళ.. అధినేతలుగా వ్యవహరించేవారు ఆచితూచి అన్నట్లు ఖర్చులు పెట్టాలి. కానీ.. ఇందుకు భిన్నంగా వారి ధోరణి ఉందనే చెప్పాలి.
అయితే.. వీరిద్దరి విషయంలో ఒక వ్యత్యాసం ఉంది. ప్రత్యేక విమానాల్లో ప్రయాణించి చంద్రబాబు విమర్శల పాలు కావటమే కాదు.. దుబారా ముఖ్యమంత్రి పేరును తెచ్చి పెట్టుకున్నారు. చంద్రబాబు మాదిరే కేసీఆర్ సైతం తన ప్రయాణాల కోసం ప్రత్యేక విమానాల్లో ప్రయాణించినా.. ఆ విషయం పెద్దగా ఫోకస్ కాలేదనే చెప్పాలి. ఆ మధ్య జాతీయ రాజకీయాల్లో కీలకభూమిక పోషించే ప్రయత్నంలో భాగంగా.. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతోనూ.. పార్టీ అధినేతలతో భేటీ కావటం తెలిసిందే.
ఆ సందర్భంగా కేసీఆర్ ప్రత్యేక విమానాల్నే వినియోగించే వారు. అప్పుడు కానీ.. ఆ తర్వాత కానీ ఆయన ప్రత్యేక విమానాల పర్యటనలు ఎప్పుడూ చర్చనీయాంశం కాలేదు. తాజాగా ప్రధాని మోడీతో భేటీ కోసం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఇందులో భాగంగా ఢిల్లీకి వెళ్లనున్న సీఎం కేసీఆర్ ఎప్పటిలానే ప్రత్యేక విమానంలోనే దేశ రాజధానికి పయనం కానున్నారు. ఒకే పని ఇద్దరు కీలక అధినేతలు చేస్తే.. ఒకరు ఆగమాగం అయితే.. మరొకరు అలాంటి ఇమేజ్ అన్నదే మీద పకుండా ఉండటం చూస్తే.. దాన్ని సుడి అనాలా? కొందరి యోగం అలానే ఉంటుందనుకోవాలా?