Begin typing your search above and press return to search.
రెండు రోజుల్లో ఎలక్షన్.. టీఆరెస్ చీఫ్ రిలాక్స్
By: Tupaki Desk | 31 Jan 2016 1:30 PM GMTక్రికెట్ లో ఎందరు హార్డ్ హిట్టర్లు వచ్చినా వీరేంద్ర సెహ్వాగ్ కు ఉన్న ప్రత్యేకతే వేరు. ఆయన రిటైరైనా కూడా ఇప్పటికీ వీరూ పేరు చెబితే అభిమానుల నరాల్లో రక్తం పరుగులు తీస్తుంది. ఆయన ఆటను, షాట్లను గుర్తు చేసుకుని ఆనందిస్తారు. అస్సలు టెన్షన్ పడకపోవడమే వీరూ విజయ రహస్యమని చెబుతుంటారు. అది ఆయన ఆటలోనూ కనిపిస్తుంది. 296 పరుగుల మీదున్నప్పుడు సిక్సు కొట్టే ధైర్యమున్న వీరూ మ్యాచ్ కు ముందు హాయిగా నిద్రపోతాడట. మిగతా ఆటగాళ్లంతా ప్రత్యర్థి ఆటగాళ్ల లోపాలేంటి... వారి బౌలింగు, బ్యాటింగు ఎలా ఉంటుంది... వ్యూహాలు ఎలా ఉంటాయన్నవి మైక్రో లెవల్లో అనాల్సిస్ చేసుకుని వ్యూహ రచన చేసుకుంటుంటే వీరూ మాత్రం హాయిగా గుర్రుపెట్టేవాడట. ఇప్పుడు రాజకీయాల్లోనూ టీఆరెస్ అధినేత కేసీఆర్ తీరు అలాగే కనిపిస్తోంది. రెండు రోజుల్లో ఎలక్షన్ ఉందనగా ఆయన అంతకుముందు పర్వమైన ప్రచారాన్ని ముగించుకుని హాయిగా తన ఫాం హౌస్ కు విశ్రాంతి కోసం వెళ్లిపోయారు.
కేసీఆర్ మాటలు కానీ, ఎత్తుగడలు కానీ, పొలిటికల్ ట్విస్టులు కానీ ప్రత్యర్థుల అంచనాలకు మించే ఉంటాయి. తాజాగా గ్రేటర్ ఎన్నికల ప్రచారంలోనూ ఆయన ముందంతా కామ్ గా ఉండి... చివర్లో ప్రచారానికి వచ్చి తొలుత చప్పగా మొదలుపెట్టి చివర్లో చురుకు పుట్టించారు. ఏపీ సీఎం చంద్రబాబుకు హైదరాబాద్ లో ఏం పని అంటూ తెలంగాణవాదులను రెచ్చగొట్టారు... ఒక్క రోజు తేడాలో మళ్లీ రూటు మార్చి చంద్రబాబు టీడీపీకి ఓటేసినా భువనేశ్వరి వదినమ్మ మాత్రం టీఆరెస్ కే ఓటేస్తానని తనకు మాటిచ్చారంటూ టీడీపీలో గందరగోళం సృష్టించారు. ఈ రకంగా గ్రేటర్ ప్రచారానికి ఒక ఊపు తెచ్చిన కేసీఆర్ తన బాధ్యత పూర్తవగానే రిలాక్సయిపోవడానికి ఫాం హౌస్ కు వెళ్లిపోయారు. హైదరాబాద్ లో ప్రచారం ముగించుకున్న ఆయన శనివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో మెదక్ జిల్లా జగదేవ్ పూర్ లోని తన ఫాం హౌస్ వైపు కాన్వాయ్ ను దౌడు తీయించారు.
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో శనివారం రాత్రి సభ ముగియగానే ఆయన కాన్వాయ్ ఎర్రవెల్లి బాటపట్టింది. ఆది, సోమవారాలు ఆయన అక్కడే ఉంటారు. మళ్లీ 2వ తేదీన ఎన్నిలక పోలింగ్ సమయంలో హైదరాబాద్ లో అడుగుపెడతారు.
గ్రేటర్ ఎన్నికల్లో టీఆరెస్ పరిస్థితి అనుకున్నంత ఈజీగా లేదని అంతర్గత సర్వేలు చెబుతుండడంతో కేసీఆర్ రంగ ప్రవేశం చేసి ఊపు తెచ్చారు. ఆ క్రమంలో కొత్త మిత్రుడు చంద్రబాబుపైనా ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు... భువనేశ్వరి ఓటు తమకేనంటూ టీడీపీలో అయోమకం సృష్టించి టీఆరెస్ కార్యకర్తల్లో ఊపు తెచ్చారు. ఇంత చేసిన ఆయన రెండు రోజుల్లో ఎన్నికలు పెట్టుకుని హాయిగా విశ్రాంతి తీసుకోవడానికి వెళ్లిపోవడం మాత్రం గొప్ప విషయమే. కంటి మీద కునుకు పట్టడమే కష్టమనుకునే కీలక సమయంలో ఆయన ఎన్నికలకు దూరంగా ఉండడం ఆశ్చర్యకరమే. అయితే... కేసీఆర్ కావాలనే ఎన్నికలకు దూరంగా ఉన్నారని... తన కుమారుడు కేటీఆర్ కు ఇది సామర్ధ్య పరీక్షగా ఆయన భావిస్తున్నారని తెలిసివారు చెబుతున్నారు. తన పరోక్షంలో కేటీఆర్ సొంతంగా ఈ ఎన్నికల్లో గెలిస్తే ఆయన ఆత్మవిశ్వాసం రెట్టింపై భవిష్యత్తులో తిరుగులేని నేత కాగలరన్న ఉద్దేశంతోనే ఆయన ఇందులో జోక్యం చేసుకోకుండా దూరమయ్యారని చెబుతున్నారు. మరి గ్రేటర్ ఎన్నికలు కేటీఆర్ కు క్షాత్ర పరీక్ష అవుతాయా క్షత్రియ పరీక్ష అవుతాయో చూడాలి.