Begin typing your search above and press return to search.
కేసీఆర్ ఓ మంచి గాయకుడు
By: Tupaki Desk | 1 April 2018 9:04 AM GMTతెలంగాణ ముఖ్యమంత్రి - టీఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గురించి ఆయన తనయుడైన మంత్రి కేటీఆర్ ఆసక్తికరమైన విషయం ఒకటి పంచుకున్నారు. ఉద్యమకారుడిగా సుప్రసిద్ధుడు అయిన గులాబీ దళపతి కేసీఆర్ భాషాభిమాని అనే సంగతి తెలిసిందే. కొద్దికాలం క్రితం తెలుగు మహాసభలు అట్టహాసంగా నిర్వహించి అందరి మన్ననలు పొందారు. పుస్తక పఠనంపై విశేష ఆసక్తి ఉన్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. అలాంటి కేసీఆర్‌లో మంచి సింగర్ కూడా ఉన్నారట. ఈ విషయాన్ని వెల్లడించింది ఎవరో తెలుసా? స‌్వయంగా కేటీఆరే!.
క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నవారి కోసం స్పర్శ్ హోస్పైస్ సంస్థ హైదరాబాద్ లోని ఖాజాగూడలో ఆస్పత్రిని నిర్మించనుంది. నిధుల సేకరణలో భాగంగా మాదాపూర్‌లోని శిల్పకళావేదికలో సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. క్యాన్సర్‌తో బాధపడుతూ చివరిదశలో ఉన్న రోగులకు స్వచ్ఛందంగా సేవలందించడం కోసం స్పర్శ్ హోస్పైస్ ఖాజాగూడలో నిర్మిస్తున్న 70 పడకల ధర్మాసుపత్రి నిర్మాణానికి ఎకరా స్థలాన్ని కేవలం రూపాయి లీజుకు ప్రభుత్వం ఇస్తున్నదని తెలిపారు. దవాఖాన నిర్మాణంలో భాగంగా అనుమతులకు అయ్యే ఖర్చులను జీహెచ్ఎంసీ భరిస్తుందన్నారు. స్పర్శ్ హోస్పైస్ చేస్తున్న సేవకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారు.
నిధుల సేకరణలో భాగంగా ప్రముఖ సంగీత దర్శకుడు - గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటుచేయడం సంతోషంగా ఉందన్నారు. ప్రముఖ గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యానికి కేసీఆర్ అభిమాని అని చెప్పారు. తన తండ్రి చాలా బాగా పాటలు పాడతారని, ఆయన కాలేజీలో చదువుకునే రోజుల్లో అనేక పోటీలలో పాల్గొని బహుమతులు కూడా గెలుచుకున్నారని కేటీఆర్ అన్నారు. రాజకీయాల్లో తీరిక లేకుండా ఉన్నందున పాటలు వినే అవకాశం తనకు దొరకదని మంత్రి కేటీఆర్ పేర్కొంటూ ఎస్పీ బాలు పాడుతున్నపుడు ప్రత్యక్షంగా చూడటం తనకెంతో ఆనందాన్నిచ్చిందని మంత్రి కేటీఆర్ చెప్పారు.