Begin typing your search above and press return to search.
పెండింగ్ బకాయిల లెక్క బయటకు ఇచ్చేసిన కేసీఆర్ సర్కారు
By: Tupaki Desk | 15 Feb 2020 11:30 AM GMTచేతికి ఎముక లేనట్లుగా ఇష్టమొచ్చినట్లుగా ఖర్చు పెడితే ఎలా ఉంటుంది. వరుస పెట్టి సంక్షేమ కార్యక్రమాల పేరుతో భారీగా నిధుల్ని పప్పు బెల్లాల మాదిరి పంచిపెడితే.. ప్రభుత్వాన్ని నడపటం ఎంత కష్టమన్న విషయం ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు బాగానే అర్థమైందని చెప్పాలి. డెవలప్ మెంట్ పనుల పేరుతో చేసిన ఖర్చు తెలంగాణ ప్రభుత్వ ఆర్థికస్థితి కి గుదిబండలా మారింది. ఈ మధ్యన సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. వంద రూపాయిలు తీయాలంటే లక్ష రూపాయిలు తీసినట్లు గా ఉందన్న మాట విన్నప్పుడు డేంజర్ బెల్స్ మోగాయని చెప్పాలి.
తాజాగా తెలంగాణ రాష్ట్రంలో పేరుకు పోయిన బకాయిల వివరాలు బయటకు వచ్చాయి. ఇంతకాలం గుట్టుగా ఉంచిన ప్రభుత్వం.. తాజాగా ఒక సమాచార హక్కు చట్టం కార్యకర్త ఒకరు దాఖలు చేసిన పిటిషన్ కు స్పందించి.. వివరాలు బయటపెట్టింది. తాజాగా తేలిన లెక్కల ప్రకారం తెలంగాణ ప్రభుత్వం వద్ద పెండింగ్ లో ఉన్న బిల్లుల సంఖ్య ఎంతో తెలుసా? అక్షరాల లక్ష. మరీ.. బకాయిల విలువ ఎంతో తెలుసా? ఏకంగా రూ.20వేల కోట్లు కావటం గమనార్హం.
అత్యధికంగా ఇరిగేషన్ శాఖకు రూ.10వేల కోట్ల బకాయిలు ఉంటే.. తర్వాతి స్థానం రహదారులు..భవనాల శాఖ ఉంది. ఈ శాఖ చెల్లించాల్సిన బకాయిలు ఏకంగా రూ.1127 కోట్లు. తర్వాతి స్థానం పంచాయితీరాజ్ (రూ.792 కోట్లు).. అయితే ఆ తర్వాతి స్థానం ఫైనాన్స్.. కొర్పొరేషన్స్ (రూ.770 కోట్లు) గా తేలింది. గడిచిన కొద్దికాలంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ మాత్రం బాగోలేదని.. బకాయిలు అంతకంతకూ పేరుకుపోతూ.. తీవ్ర ఇబ్బందుల్లో ప్రభుత్వం ఉందన్న విషయం తాజాగా మరోసారి స్పష్టమైందని చెప్పాలి. ఇప్పటి వరకూ అనధికారికం గా బయటకు వచ్చిన సమాచారం నిజమేనన్న విషయం ప్రభుత్వం ఇచ్చిన అధికారిక సమాచారం తో తేలినట్లైంది.