Begin typing your search above and press return to search.
కరోనాపై కేసీఆర్ సర్కారు సంచలన నిర్ణయం
By: Tupaki Desk | 16 March 2020 9:30 AM GMTకరోనా భయం ఇప్పుడు అందరినీ ఆవహించింది. తాజాగా తెలంగాణలో మరో పాజిటివ్ కేసు బయటపడింది. ఇప్పటికే స్కూళ్లు, కళాశాలలు సహా అన్నింటికి సెలవులు ఇచ్చేసిన కేసీఆర్ సర్కారు అయినా కరోనా ఉధృతి బయట పడడంతో సంచలన నిర్ణయం తీసుకుంది. ఏకంగా హైదరాబాద్ లోని గచ్చిబౌలి స్టేడియాన్ని కరోనా క్వారంటైన్ కేంద్రంగా మార్చాలని సంచలన నిర్ణయం తీసుకుంది.
కరోనాను ఎదుర్కొనేందుకు తెలంగాణ సర్కారు ఇప్పటికే గాంధీ, చెస్ట్, ఫీవర్, వికారాబాద్ ప్రకృతి కేంద్రాల్లో ప్రత్యేక ఐసోలేషన్ వార్డులను సిద్ధం చేసింది. అయితే అనుమానితుల సంఖ్య పెరగడంతో తెలంగాణ సర్కారు ఏకంగా గచ్చిబౌలి స్టేడియాన్నే కరోనా క్వారంటైన్ కేంద్రంగా మార్చి 300 పడకలతో ఆస్పత్రిగా మార్చాలని డిసైడ్ అయ్యింది.
ఈ మేరకు జీహెచ్ఎంసీ, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు స్టేడియాన్ని పరిశీలించారు. అందులో పారిశుధ్య పనులు పూర్తి చేసి 2 రోజుల్లో స్టేడియాన్ని 300 పడకల కరోనా ఆస్పత్రిగా మార్చబోతున్నారు.
తెలంగాణలో కేసులు తక్కువైనా అనుమానితుల సంఖ్య బాగా పెరుగుతోంది. అందుకే మొదట అనుమానితులను ఈ గచ్చిబౌలి కేంద్రానికి తీసుకొచ్చి టెస్టులు చేసి ఆ తరువాత వ్యాధి సోకితే కరోనా కేంద్రాలకు తీసుకెళ్లాలని ఈ నిర్ణయం తీసుకుంది. ఓ రకంగా కేసీఆర్ సర్కారు దేశంలో పెరిగిపోతున్న కరోనా తీవ్రతపై తెలంగాణ లో యుద్ధం మొదలు పెట్టినట్టే కనిపిస్తోంది. ఇందుకోసమే ఏకంగా స్టేడియాన్ని ఆస్పత్రిగా మార్చేస్తున్నారు.