Begin typing your search above and press return to search.
రాజ్యాంగం మార్చాలనే డిమాండ్‌లో కేసీఆర్ కొత్త ట్విస్ట్
By: Tupaki Desk | 14 Feb 2022 3:32 AM GMTకేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రాజ్యాంగాన్ని మార్చాలనే సంచలన డిమాండ్ ను తెలంగాణ సీఎం కేసీఆర్ చేయడం, అనంతరం ఈ విషయంలో అనుకూల - ప్రతికూత వివిధ వర్గాల నుంచి దేశ వ్యాప్త చర్చ జరగడం తెలిసిన సంగతే. అయితే, దీనిపై కేసీఆర్ మళ్లీ రియాక్టయ్యారు. దేశంలో ఉన్న దళితుల బాగోగుల కోసమే కొత్త రాజ్యాంగం రావాలని తాను కోరుకుంటున్నట్లు తెలంగాణ సీఎం కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు.
రాజ్యాంగం మార్చాలని తాను చేసిన వ్యాఖ్యలపై వస్తున్న కామెంట్ల గురించి తాజాగా ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో తెలంగాణ సీఎం కేసీఆర్ స్పందిస్తూ, దేశం బాగుపడాలంటే... అందరికీ సమాన హక్కుల కోసం రాజ్యాంగం మారాలని అభిప్రాయపడ్డారు.
77 శాతం దేశ సంపద 90 శాతం మంది దగ్గర ఉండాలనే కొత్త రాజ్యాంగం కోరుకుంటున్నానని పేర్కొన్నారు.
దళితుల రిజర్వేషన్లు 19% పెంచడానికి, BCల కులగణన కోసం, దేశమంతా దళితబంధు పెట్టడం కోసం కొత్త రాజ్యాంగం కావాలంటున్నానని తెలిపారు. ఆడబిడ్డలకు ఆస్తిలో సమాన హక్కు కోసం కొత్త రాజ్యాంగం రాయాలని కేసీఆర్ అన్నారు.
ప్రస్తుతం రచ్చరచ్చగా మారిపోయిన హిజాబ్ వివాదంపైనా తెలంగాణ సీఎం కేసీఆర్ మరోమారు స్పందించారు. హిజాబ్ వివాదంపై ప్రధానితో పాటు దేశం మొత్తం మౌనం వహిస్తోందని ఆరోపించారు. దేశ యువత మధ్య ఎందుకు విద్వేషాలు రగులుస్తున్నారని నిలదీశారు. శాంతిభద్రతలు కోరుకుందామా? ఘర్షణలు, కర్ఫ్యూలు కోరుకుందామా? అనేది యువత ఆలోచించుకోవాలన్నారు.
అంతర్యుద్ధం చెలరేగితే దేశం గతేంటని.. కర్ణాటక పరిస్థితి దేశవ్యాప్తంగా వస్తే పరిస్థితి ఏంటని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. శాంతి లేని చోట పెట్టుబడులు ఎవరు పెడతారని కేసీఆర్ మండిపడ్డారు. బీజేపీ విద్వేషపూరిత మత రాజకీయాల గురించి యువత ఆలోచించాలని సీఎం కేసీఆర్ సూచించారు.