Begin typing your search above and press return to search.
పీవీ కోసం క్లింటన్, ఒబామా.. కేసీఆర్ మాస్టర్ ప్లాన్
By: Tupaki Desk | 2 Aug 2020 10:30 AM GMTభారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలను జూన్ 28నుంచి ఏడాది పార్టీ నిర్వహించాలని డిసైడ్ అయిన సీఎం కేసీఆర్ ఇప్పుడు కాంగ్రెస్ మరో షాక్ ఇవ్వబోతున్నారు. ఏకంగా సోనియా, రాహుల్ ఉన్న ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో పీవీ స్మారక కార్యక్రమాన్ని గ్రాండ్ గా చేయాలని డిసైడ్ అయ్యారు. ఈ కార్యక్రమానికి మాజీ అమెరికా అధ్యక్షులను ఆహ్వానిస్తూ జలక్ ఇస్తున్నారు. దీంతో పీవీ నామస్మరణతో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి ఇరుకునపడే అవకాశం ఉంది. గతంలో పీవీని సోనియా అవమానించడంతో ఈ పరిణామం కాంగ్రెస్ వర్గాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు గౌరవార్థం ప్రతిష్టాత్మకంగా ఢిల్లీలో కార్యక్రమం నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలోనే అమెరికా మాజీ అధ్యక్షులు బిల్ క్లింటన్, బరాక్ ఒబామాలతోపాటు బ్రిటన్ మాజీ ప్రధాని జాన్ మేజర్ ను కూడా ఆహ్వానించాలని డిసైడ్ అయ్యింది.
పీవీ విదేశాంగమంత్రిగా.. ప్రధానిగా చాలా మంది దేశాధినేతలో సత్సంబంధాలు కలిగి ఉన్నారు. వారిని రప్పించడం ద్వారా పీవీని మరిచిన కాంగ్రెస్ ను ఢిల్లీ వేదికగా అభాసుపాలు చేసేందుకు కేసీఆర్ నడుం బిగించారని తెలుస్తోంది. కేసీఆర్ వేసిన ఈ ప్లాన్ వర్కవుట్ అవుతుందా లేదా అన్నది వేచిచూద్దాం.