Begin typing your search above and press return to search.

నరేశ్ ను తనదైన స్టైల్లో వారించిన కేసీఆర్.. ఎందుకలా జరిగింది?

By:  Tupaki Desk   |   16 Nov 2022 4:37 AM GMT
నరేశ్ ను తనదైన స్టైల్లో వారించిన కేసీఆర్.. ఎందుకలా జరిగింది?
X
ఎంత ప్రముఖులైనా.. మరెంత తోపులైనా సరే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కొన్ని విషయాల్లో చాలా స్పష్టంగా ఉంటారు. ఎవరు ఏమనుకుంటారన్న విషయాన్ని అస్సలు పట్టించుకోరు. తానేం చేయాలో అది మాత్రమే చేసే అలవాటు ఉన్న ఆయన.. ప్రముఖులు పలువురు పరమపదించినా.. ఆయన మాత్రం వారికి నివాళులు అర్పించేందుకు మాత్రం కాలు బయటకు పెట్టరు. అలాంటి కేసీఆర్.. మరికొందరి విషయంలో మాత్రం చాలా వేగంగా నిర్ణయాలు తీసుకుంటారు. అలాంటిదే సూపర్ స్టార్ కృష్ణకు ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు పూర్తి చేయాలన్న ఆదేశంతోపాటు.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని దగ్గరుండి పనులు పూర్తి చేసేలా సాయం అందించాలని కోరటం.

అంతేకాదు.. సూపర్ స్టార్ కృష్ణ పార్దివ దేహాన్ని సందర్శించి..ఆయనకు నివాళులు అర్పించేందుకు నానక్ రాం గూడలోని కృష్ణ నివాసానికి సీఎం కేసీఆర్ వచ్చారు. ఈ సందర్భంగా ఆయన 15 నిమిషాల నుంచి 20 నిమిషాల పాటు అక్కడే ఉన్నారు. ఈ సందర్భంగా కృష్ణ పార్దిపదేహం వద్దకు వెళ్లి.. నివాళులు అర్పించారు. అనంతరం మహేశ్ బాబు.. నమ్రతా దంపతుల వద్ద కూర్చున్నారు. మహేశ్ బాబుకు ఆత్మీయ ఆలింగనం చేసుకొని.. ఆయన్ను ఓదార్చే ప్రయత్నం చేశారు.

ఇలాంటి వేళలో.. సీఎం కేసీఆర్.. మహేశ్ బాబు..నమ్రతా కూర్చొని ఉండగా.. సినీయర్ నటుడు నరేశ్.. ఆయన పక్కనే నిలబడ్డారు. ఈ సందర్భంగా ఏదో మాట్లాడుతుండటంతో మొదట్లో విన్న కేసీఆర్.. కాసేపటికే నరేశ్ ఏదో మాట్లాడుతుంటే.. ఆయన చేతిని పట్టుకొని.. ఇక.. మాట్లాడొద్దు అన్న రీతిలో తన రెండో చేతిలో చెప్పేశారు. ఆ సమయంలో కేసీఆర్ గంభీరంగా ఉన్నారు. దీంతో.. నరేశ్ ఒక్కసారి హతాశులయ్యారు. నవ్వుముఖం మీదకు తెచ్చుకొని ఇబ్బందికి గురయ్యారు. నరేశ్ హడావుడికితనదైన శైలిలో బ్రేకులు వేసిన సీఎం కేసీఆర్..

మరోవైపు.. మహేశ్ బాబు - నమ్రతతో మాట్లాడేందుకు ఆసక్తి చూపారు. వారితో పలు విషయాలు చర్చించారు. ఈ సందర్భంగా మహేశ్ చాలా తక్కువగా మాట్లాడగా.. ఆయన సతీమణి నమ్రత సీఎం కేసీఆర్ కు థ్యాంక్స్ చెప్పారు. మొత్తంగా చూసినప్పుడు మహేశ్-నమ్రతలకు సీఎం కేసీఆర్ అత్యధిక ప్రాధాన్యత ఇచ్చినట్లుగా కనిపించింది.

దీనికి సంబంధించిన వీడియో క్లిప్ ఒకటి వైరల్ గా మారింది. అవసరానికి మించి ఎవరు చొరవ తీసుకున్నా.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంత సింపుల్ గా కట్టడి చేస్తారన్న దానికి ఈ వీడియో నిదర్శనమని చెబుతున్నారు. అనవసర ఉత్సాహాన్ని కేసీఆర్ దగ్గర ప్రదర్శిస్తే ఇలాంటి ఫలితమే ఎదురవుతుందంటున్నారు. ఇలాంటి విషయాల్లో కేసీఆర్ కత్తి చాలా పదునుగా ఉంటుందన్న మాట వినిపిస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.