Begin typing your search above and press return to search.

చినజీయర్ ఆశ్రమానికి వెళ్లిన కేసీఆర్ అక్కడేం చేశారో తెలుసా?

By:  Tupaki Desk   |   12 Oct 2021 4:11 AM GMT
చినజీయర్ ఆశ్రమానికి వెళ్లిన కేసీఆర్ అక్కడేం చేశారో తెలుసా?
X
దేశంలో చాలామంది ముఖ్యమంత్రులు ఉన్నా.. వారిలో ఎవరికి లేని ఒక లక్షణం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ లో కనిపిస్తూ ఉంటుంది. ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. ఆయన తీరు ఆయనకు మాత్రమే సొంతం. మరెవరితోనూ పోల్చలేం. ఆయన తీరే చాలా భిన్నంగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఎంతటి ప్రముఖుడికైనా ఆయన దర్శన భాగ్యం కూడా లభించదు. ఆయన్ను కలుసుకోవటం ఎంతో కష్టమన్నట్లు ఉంటుంది. అదే కేసీఆర్ లో మరోకోణం ఉంటుంది. తనకు నచ్చినప్పుడు ఎంత సాదాసీదాగా వ్యవహరిస్తారో.. సామాన్య ప్రజానీకానికి తానెంత దగ్గరో అన్నట్లుగా ఆయన తీరు ఉంటుంది. ఇలాంటి భిన్నమైన షేడ్స్ ఒక సీఎంలో కనిపించటం చాలా అరుదుగా చెప్పాలి.

కేసీఆర్ కు ఉన్న నమ్మకాల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం ఉండదు. అంతేకాదు.. కొందరి విషయంలో ఆయన చాలా భిన్నంగా వ్యవహరిస్తుంటారు. చినజీయర్ స్వామి అంటే నమ్మకంతో పాటు.. ఆయనంటే చాలా భక్తి భావం కూడా. ప్రగతి భవన్ లో తాము గ్రహప్రవేశ కార్యక్రమాన్ని నిర్వహించిన వేళలోనూ.. మిగిలిన సందర్భాల్లోనూ సాష్ఠాంగ నమస్కారం చేయటానికి కేసీఆర్ అస్సలు వెనకాడలేదు.

కొన్ని సందర్భాల్లో తానే ప్రత్యేకంగా జీయర్ స్వామి ఆశ్రమానికి వెళుతుంటారు. తాజాగా ఆయనఅలానే వేళ్లారు. స్వామిజీతో కలిసి మొక్కలు నాటిన ఆయన.. లంచ్ కూడా అక్కడే ఉండిపోయారు. ఆసక్తికరమైన సీన్ అంతా లంచ్ లోనే. హైదరాబాద్ లో అందరూ ఫాలో అయ్యే బఫే కు భిన్నంగా.. సహపంక్తి భోజనానికే కేసీఆర్ ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు. జీయర్ ఆశ్రమంలోనూ అదే రీతిలో సహ పంక్తి భోజనానికి కూర్చున్న సీఎం కేసీఆర్.. తనకు ఇరు వైపులా.. గ్యాప్ ఉండేలా చూసుకోవటం విశేషం. కుడి వైపున ఎవరూ .. డెడ్ ఎండ్ పెట్టేసుకొని.. ఎడమ వైపున మాత్రం తనకు సన్నిహితుడైన మైహోం రామేశ్వరరావు కూర్చొని ఉండగా భోజనం చేశారు.

ఈ లంచ్ గురించి చూసినంతనే.. ఆ మధ్యన తన దత్తత గ్రామమైన వాసాలమర్రిలో .. అక్కడి స్థానికులతో కలిసి తాను భోజనం చేసిన సీన్ గుర్తుకు రాక మానదు. అక్కడ తనకు చెరోపక్కన గ్రామస్తుల్ని కూర్చొబెట్టుకొని భోజనం చేసిన కేసీఆర్.. చిన జీయర్ స్వామి ఆశ్రమంలోని భోజన వేళలో మాత్రం.. తనకు చాలా దూరంగా తన జిగిరీ స్నేహితుడ్ని కూర్చొబెట్టుకొని భోజనం చేయటం రోటీన్ కు కాస్త భిన్నమన్నట్లుగా కనిపించిందని చెప్పక తప్పదు. ఏమైనా ఇలాంటివి కేసీఆర్ కు మాత్రమే చెల్లు అని చెప్పాలి.