Begin typing your search above and press return to search.
లాక్ డౌన్ లీకుల వెనుక అసలు లెక్క ఇదేనట
By: Tupaki Desk | 29 Jun 2020 4:15 AM GMTవిషయం ఏదైనా ఓపెన్ గా చెప్పేసే దమ్ము.. ధైర్యం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ లో టన్నుల కొద్దీ ఉండే విషయాన్ని ఎవరూ కాదనరు. మహమ్మారి ముప్పు మొదలైన వేళ.. ఎంతో యాక్టివ్ గా ఉండటమే కాదు.. రోజువారీగా సమీక్షలు.. రెండు.. మూడు రోజులకోసారి ప్రెస్ మీట్ పెట్టటం.. ప్రపంచ వ్యాప్తంగా ఏమేం జరుగుతుందన్న విషయాలతో పాటు.. లాక్ డౌన్ వేళ తనకొచ్చిన ఆలోచనల్ని.. సమాచారాన్ని ప్రజలతో పంచుకునే వారు. వివిధ అంశాలపై ఆయనకున్న పట్టుకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఫిదా అయ్యే పరిస్థితి.
కేసీఆర్ ప్రెస్ మీట్ ఎప్పుడెప్పుడా? అని ఎదురుచూడటమే కాదు.. ఆయన ప్రెస్ మీట్ అంటే చాలు.. తాము చూస్తున్న ఎంటర్ టైన్మెంట్ చానళ్లనుసైతం మార్చేసి కేసీఆర్ ఇంటర్వ్యూల్ని ఫాలో కావటం అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. ఓపెన్ గా మాట్లాడేయటం.. ఏముందో? దాన్ని అంగీకరించాలన్నట్లు ఉండే కేసీఆర్ తీరుకు భిన్నమైన వార్తలు ఆదివారం సాయంత్రం నుంచి వస్తున్నాయి. అంతకంతకూ ఎక్కువ అవుతున్న పాజిటివ్ కేసుల నేపథ్యంలో హైదరాబాద్ మహానగరంలో మరోసారి లాక్ డౌన్ విధించాలన్నయోచనలో ప్రభుత్వం ఉన్న వైనం బయటకు వచ్చింది.
పలువురుకీలక అధికారులతో నిర్వహించిన భేటీ సందర్భంగా.. హైదరాబాద్ లో లాక్ డౌన్ విధించాలన్నఅవసరాన్ని పేర్కొనటమే కాదు.. అందుకున్న కారణాల్ని అధికారులు వెల్లడించినట్లుగా సమాచారం. ఇటీవల కాలంలో పరీక్షల్ని పెంచటంతో కేసుల నమోదు మరింత పెరిగింది. శని.. ఆదివారాల్లో వరుస పెట్టి 850ప్లస్ పాజిటివ్ కేసులు నమోదు కావటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. హైదరాబాద్ కు చెందిన పలు వ్యాపార సంస్థలు.. మార్కెట్లు తమకు తాముగా స్వీయ లాక్ డౌన్ నిర్ణయాన్ని తీసుకొని ప్రకటిస్తున్న వైనం తెలిసిందే.
ఇదే విషయాన్ని అధికారులు సీఎం కేసీఆర్ తో జరిగిన చర్చ సందర్భంగా ప్రస్తావించినట్లుగా చెబుతున్నారు. లాక్ డౌన్ విధించటం అనివార్యమని పేర్కొన్నట్లు తెలుస్తోంది. మరోసారి సంపూర్ణ లాక్ డౌన్ అంటే పలు అంశాల్ని పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్న ఆయన.. నాలుగైదు రోజుల్లో నిర్ణయాన్ని తీసుకుంటామని చెప్పినట్లుగా చెబుతున్నారు.
లాక్ డౌన్ అంటే.. ప్రజలు సామాన్లు కనుక్కోవటానికి అవకాశం ఇవ్వటం.. నిత్యవసర వస్తువులు కొనుగోలు చేయటానికి రోజుకు ఒకట్రెండు.. గంటలకే సడలింపులు ఇవ్వటం.. రోజంతా కర్ఫ్యూను విధించాల్సి రావటంతో పాటు.. విమానాలు.. రైళ్లను ఆపాల్సి ఉంటుందని పేర్కొంటున్నట్లు చెబుతున్నారు. ఇవే కాకుండా.. ఉన్నట్లుండి లాక్ డౌన్ ప్రకటిస్తే.. ప్రజలు ఆందోళనకు గురయ్యే ప్రమాదం ఉందని.. అందుకే అలాంటి వారికి మూడు.. నాలుగు రోజులు సమయమివ్వటం..వారిని మెంటల్ గా ప్రిపేర్ అయ్యేలా చేసి లాక్ డౌన్ ప్రకటన విడుదల చేసే అవకాశం ఉందంటున్నారు. లాక్ డౌన్ కాస్త ఆగి.. ఆలోచించి ప్రకటిద్దామన్న దాని వెనుక చాలానే లెక్కలున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.